Viral Video: మండే ఎండలో చెప్పులు లేకుండా కిలోమీటర్ల నడక.. అయినా తప్పని నిరాశ..

దేశంలో ఎండలు తీవ్ర రూపం దాల్చాయి. భానుడి భగభగతో ప్రజలు బయటకు రావడానికే భయపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నడవలేని స్థితిలో ఉన్నా.. ఓ పేద వృద్ధురాలు ఫించన్ కోసం ఎండలో కిలోమీటర్ల దూరం కుర్చీ సాయంతో కాళ్లకు చెప్పులు లేకుండా నడిచింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్(Viral Video) అవుతోంది. కానీ ఆమె వేలిముద్ర సరిపోలలేదని బ్యాంక్ సిబ్బంది ఆమెను వెనక్కు పంపారు. ఈ ఘటన ఓడిశాలో జరిగింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు బ్యాంకుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వృద్ధురాలును అలా బాధపెట్టడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఒడిశాలోని నబ్రంగ్ పూర్ జిల్లా ఝరిగావ్ కు చెందిన 70 ఏళ్ల సూర్య హరిజన్ అనే వృద్ధురాలు నివాసిస్తోంది. ఆమెకు ఇద్దరు కుమారులు ఉండగా.. పెద్ద కొడుకు ఇతర రాష్ట్రాలకు వెళ్లి కూలీగా పని చేస్తున్న. చిన్న కొడుకు అక్కడే ఉంటూ పశువులను కాస్తూ జీవనం సాగిస్తున్నాడు. సూర్య హరిజన్ కు ఫించన్ వస్తుంది. ఆ డబ్బులు బ్యాంక్ అకౌంట్ లో పడతాయి. ఆమె ఏప్రిల్ 17న తన ఫించన్ పైసలు తీసుకోవడానిక కుర్చీ సాయంతో కిలో మీటర్ల దూరం నడిచి బ్యాంక్ కు వెళ్లింది. అక్కడ సిబ్బంది ఆమె బొటనవేలు బయోమెట్రిక్ తీసుకుని డబ్బులు ఇవ్వాలి.

oldage

అయితే ఆమె బొటనవేలు రికార్డులకు మ్యాచ్ కాకపోవడంతో డబ్బులు ఇవ్వలేదు. దీంతో ఆమె వెనుదిరిగారు. దీనిపై తీవ్ర విమర్శులు రావడంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ స్పిందించారు. సూర్య హరిజన్ కు వేళ్లు విరిగిపోవడంతో బ్యాంక్ నుంచి పైసలు తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారి చెప్పారు. ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తామని తెలిపారు.
సూర్య హరిజన్ కు బ్యాంక్ సిబ్బంది మాన్యువల్‌గా రూ. 3,000 అందించారు. తాము సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని ఝరిగావ్ బ్రాంచ్ SBI మేనేజర్ చెప్పారు.

సాధారణంగా మనం 10 నిమిషాలు ఎండకు బయటకు వెళ్తేనే ఇబ్బంది పడతాం. 2 నిమిషాలు చెప్పులు లేకుండా నడవాలంటే భయపడతాం కానీ సూర్య హరిజన్ మండుటెండలో కాళ్లు చెప్పులు లేకుండా.. కిలో మీటర్ల దూరం నడిచిన వీడియో ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది. దేశంలో పేదవారి కష్టాలను ఈ వీడియో అద్దం పడుతోంది. ఈ వీడియో తన హృదయాన్ని కదిలించిందని ఒకరు కామెంట్ చేయగా.. ఆ బ్యాంక్ మేనజర్ ను వెంటనే తొలగించాలని మరొకరు డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+