Viral Video: నడిరోడ్డుపై హద్దులు దాటిన ముద్దులు.. వైరల్ అయిన వీడియో..
ఈ మధ్య కొందరు సిగ్గు విడిచి ఇష్టమున్నట్లు ప్రవర్తిస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ కావాలనే అలా చేస్తున్నారో.. లేక తెలియక అలా చేస్తున్నారో తెలియడం లేదు.. కానీ వారు చేసే పనులు ఇతరులకు ఇబ్బంది కలిగిస్తున్నాయి. తాజాగా ఓ జంట బైక్ కూర్చోని రొమాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఘటన ఢిల్లీలో జరిగినట్లు తెలుస్తోంది. యువకుడు బైక్ డ్రైవ్ చేస్తుంటే అమ్మాయి అతడిని ముద్దులతో ముంచెతింది.
Idiot's of Delhi
— 𝖀𝖗𝖇𝖆𝖓 𝖀𝖙𝖘𝖆𝖛 🗨️🦂 (@Buntea) July 16, 2023
Time - 7:15pm
Day - Sunday 16-July
Outer Ring Road flyover, Near Mangolpuri@dtptraffic pic.twitter.com/d0t6GKuZS5
ఆదివారం ఢిల్లీలోని మంగోల్పురిలో ఔటర్ రింగ్ రోడ్ ఫ్లైఓవర్ పై ఓ జంట బైక్ పై వెళ్తూ రొమాన్స్ చేసింది. యువకుడు బైక్ నడుపుతుండగా.. అమ్మయి అతడికి వ్యకతిరేక దిశలో పెట్రోల్ ట్యాంక్ పై కూర్చుంది. అబ్బాయిని గట్టి కౌగిలించుకుని ముద్దులు పెడుతోంది. వీరు బైక్ నిదానంగా వెళ్తుంటే.. వెనక నుంచి వస్తున్న వారు వారిని వీడియో తీశారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేరు చేశారు. ఈ వీడియో వైరల్ గా మారి పోలీసుల దృష్టికి వెళ్లింది. ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడిన వారి సమాచారం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు.

వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. అయితే వీడియో పై నెటిజన్లు భిన్నంగా స్పందించారు. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్నారని ఒకరు కామంట్ చేయగా.. మరొకరు రోడ్డును బెడ్ రూమ్ చేస్తున్నారంటూ మరొకరు కామెంట్ చేశారు. అయితే ఇలాంటి ఘటన గతంలో కూడా చాలా జరిగాయి. గతంలో వైరల్ అయిన వీడియోలో ఇద్దరు అమ్మాయిలు బైక్ వెళ్తున్నారు. ఒక అమ్మాయి బైక్ పై సరిగా కూర్చుని బండి నడుపుతుంది. మరో అమ్మాయి బైక్ ట్యాంక్ పై కూర్చుంది. వారు బైక్ హ్యాండిల్ విడిచి పెట్టి ఒకరినొకరు ముద్దు పెట్టుకున్నారు. తర్వాత కౌగిలించుకున్నారు.

ఈ వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. స్టార్ ఆఫ్ జార్ఘండ్ పేజీలో పోస్ట్ చేశారు. ఈ వీడియోకు 29 వేలకు పైగా లైక్ లు వచ్చాయి. ఈ వీడియోపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా చేస్తే కింద పడిపోతారని ఒకరు కామెంట్ చేశారు. ఒక వినియోగదారు వ్యాఖ్యానిస్తూ, 'సోదరా, జార్ఖండ్ పోలీసులను ట్యాగ్ చేయడం ద్వారా ట్వీట్ చేయండి' అని రాశారు. మరొకరు, 'అందుకే మేము అబ్బాయిలు ఒంటరిగా ఉన్నాము ఈ రోజు తెలిసింది' అని రాశారు. ఈ వీడియో ఎక్కడ తీశారు.












Click it and Unblock the Notifications