Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Viral Video: ఏడారిలో అప్పడం కాల్చిన జవాన్.. వీడియో వైరల్..!

దేశంలో ఎండలు మండిపోతున్నాయి. మొన్నటి వరకు తెలుగు రాష్ట్రాల్లో భానుడు ప్రతాపం చూపాడు. అయితే వర్షాలతో తెలంగాణ, ఏపీలో ఉష్ణోగ్రతలు కాస్త తగ్గాయి. కానీ ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ ఉష్ణోగ్రతలు కొనసాగుతోన్నాయి. ముఖ్యంగా రాజస్థాన్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, పంజాబ్ లో భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాజస్థాన్ లో ఎండలు ఏ రేంజ్ లో ఉన్నాయో తెలిపేందుకు ఓ జవాన్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఓ జవాన్ రాజస్థాన్ లో భారీ ఉష్ణోగ్రతలు ఉన్నాయని చెప్పడానికి.. ఏడారిలో అప్పడాన్ని కాల్చి చూపించాడు. ఏడారిలోని ఇసుకలో అప్పడం ఉంచాడు. దాని కాస్త ఇసుక పోశాడు. కాసేపు ఆగి అప్పడం బయటకు తీశాడు. అప్పటికే అప్పడం కాలింది. తినడానికి అనువుగా మారింది. అంత భారీ ఉష్ణోగ్రతలు ఉన్న జవాన్ దేశం కోసం పని చేస్తున్నాడు. ఆ ఎండలో కూడా తన కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నాడు. ఎండలు ఏ విధంగా ఉన్నాయో తెలపడానికి మాత్రమే వీడియో చేశాడు.

A video of a jawan firing papad in the desert is going viral on social media

సాధారణంగా ఎండ తీవ్ర చెప్పేందుకు కోడి గుడ్డు పగల గొట్టి అమ్లెట్ వేస్తారు. అయితే ఇసుకలో ఇది సాధ్యం కాదు కాబట్టి జవాన్ పాపడ్ ను కాల్చిచాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాజస్థాన్ లో వేసవి తీవ్ర కొనసాగుతోంది. కొన్ని రోజులు అక్కడ 45 డిగ్రీల నుంచి 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 47 డిగ్రీలో ఎండలో కూడా జవాన్ డ్యూటీ చేయడాన్ని నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

జవాన్లు ఎండ, వాన, చలికి తట్టుకుని దేశం కోసం పని చేస్తున్నారని కామెంట్లు చూస్తున్నారు. జవాన్లకు సెల్యూట్ చేస్తున్నారు. కాసేపు ఎండలో ఉంటే.. తట్టులేము.. కానీ జవాన్లు ఎండలోనే డ్యూటి చేస్తున్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+