Viral Video: ఈ వీడియో చూడండి చాలు.. మీ బాధలన్నీ చాలా చిన్నవిగా కనిపిస్తాయి..
చాలా మంది జీవితంలో కష్టాలను ఎదుర్కొలేక మధ్యలోనే తనువు చాలిస్తారు. మరికొందరైతే తనకు డబ్బు లేదని.. డబ్బు జీవితం బాగుండేదని అనుకుంటారు. ప్రతి చిన్న సమస్యను భూతద్దంలో చూస్తారు. కానీ పట్టుదల, కృషి, అత్మవిశ్వాసం ఉంటే ఏదైనా సాధించగలమని మాత్రం తెలుసుకోరు. కాళ్లు, చేతులు మంచిగున్నా.. కష్టం చేయడానికి ఇష్టపడరు.
కాలు లేకున్నా..
కానీ ఓ వ్యక్తి ఒక కాలు లేకపోయినా జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. అంగవైకాల్యం ఉన్నా మొక్కవోని దీక్షతో జీవితంపై పోరాటం చేస్తున్నాడు. కాలు లేకున్నా సిమెంట్ బస్తాలు మోస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందరూ అతని అత్మవిశ్వాసానికి అభినందనలు తెలుపుతున్నారు.
लोगों को अपना परिश्रम संघर्ष लगता है और दूसरों का तमाशा। pic.twitter.com/2aZuK8XpeM
— Mahant Adityanath 2.0🦁 (@MahantYogiG) August 31, 2022

20 వేలకు పైగా వ్యూస్
ఈ వీడియోను మహంత్ ఆదిత్యనాథ్ ట్విట్టర్ లో పోస్టు చేశాడు. పోస్టుతో పాటు ప్రజలు తమ కష్టార్జితాన్ని పోరాటంగా భావిస్తారు. అని రాసుకొచ్చారు.వీడియోకు నెటిజన్లు ఫిదా అయిపోయారు. ఈ వీడియోకు ఇప్పటివరకు 20 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. 5 వేలకు పైగా లైక్స్ రాగా 7వందలకు పైగా రీట్వీట్లు వచ్చాయి. ఈ వీడియో చూస్తే చాలు బతుకు ఆశ పుడుతుందని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.












Click it and Unblock the Notifications