Viral Video: పానీపూరి తింటున్న కోతి.. వైరల్ అయిన వీడియో..
పానీపూరి అనగానే.. పిల్లలు, యువతులు ఎగిరి గంతెస్తారు. ఎందుకంటే వారికి పానీపూరి అంటే అంత ఇష్టం. రోడ్డుపై ఎక్కడా పానీపూరి బండి కనిపించినా.. అక్కడికి వెళ్లిపోతారు. పానీపూరి తింటూ.. పానీ తాగుతూ ఎంజాయ్ చేస్తుంటారు. పానీపూరే కాదు.. కట్లిచ్, బెల్ పూరి ఇలా ఎన్నో వేరైటీలు రుచి చూస్తుంటారు.
માણસો બાદ હવે કપિરાજ પાણીપુરી પર ફિદા, જુઓ લારી પર કેટલી શાંતિથી આરોગી રહ્યા છે (VIDEO)#morbi #tankara #Kapiraj #monky #Ate #panipuri #viralvideo pic.twitter.com/OKiM6koEke
— Watch Gujarat (@WatchGujarat) June 20, 2023
పానీపూరికి బొక్క పెట్టి.. అందులో కర్రీ పెట్టి.. పానీలో ముంచి.. ఉల్లిపాయ వేసుకుని తింటే ఆ మజానే వేరుటుంటున్నారు కొందరు. ఈ పానీ పూరికి రకరకాల పేర్లు ఉన్నాయి. ప్రాంతాన్ని బట్టి పానీపూరిని.. గోల్గప్పా, ఫుచ్కా, బటాషా అని కూడా అంటారు. అయితే పానీపూరి మీరే తింటారా.. మేము కూడా తింటామని ఓ కోతి ముందుకొచ్చింది. కోతి పానీపూరి తింటూ ఎంజాయి చేస్తోంది.

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. గుజరాత్‌లోని టంకారా ఓ కోతి పానీపూరి బండి వద్దకు వచ్చి పానీపూరి తింటున్న వీడియో వైరల్ అయింది. ఈ వీడియోలో కోతి గోల్గప్పల ప్లేట్‌ను ఆస్వాదిస్తూ కనిపిస్తుంది. కోతి గొల్గప్ప అమ్మవారి స్టాల్ వద్దకు వచ్చి దాని పైన కూర్చోవడం కనిపించింది. ఆ వ్యక్తి గోల్గప్పల పళ్ళెం సిద్ధం చేసి అక్కడ పెట్టాడు.
దానిని తీసుకున్న కోతి తినడం ప్రారంభించాడు. ఈ ఘటన టంకరలోని దయానంద్ చౌక్‌లో చోటుచేసుకుంది. ఈ వినోదభరిత దృశ్యాన్ని చూసేందుకు చాలా మంది స్టాల్ దగ్గర గుమిగూడారు. కోతి పానీపూరి తింటున్న వీడియో చిత్రీకరించారు. వెంటనే సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు సరదాగా స్పందించారు. కోతి మనుషులకంటే బాగా పానీపూరి తింటుందని ఒకరు కామెంట్ చేశారు.












Click it and Unblock the Notifications