Viral Video: వామ్మో.. కబడ్డి ఆడుతున్న 60 ఏళ్ల వృద్ధులు.. అదీ యువకులతో..
సోషల్ మీడియాలో చాలా వీడియోలు వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా కొన్ని వీడియోలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. మరికొన్ని నవ్వులు పూయిస్తాయి. తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో కబడ్డి ఆడడం కనిపిస్తుంది. కబడ్డి ఆటలో వింతేముంది అనుకుంటున్నారు. అయితే కబడ్డి ఆడే వారు పిల్లలో, యువకులో కాదు వృద్ధులు.

వృద్ధుల జట్టు
వీడియోలో వృద్ధులు ఒక జట్టుగా ఉండగా, యువకులు మరో జట్టుగా ఉన్నారు. ఈ వీడియోలో ఓ వృద్ధడు కూతకు వచ్చాడు. అతన్ని యువకులు పట్టుకోలేకపయారు. మరోసారి మారో తాత కూతకు వచ్చాడు. ఆ తాతను కూడా పట్టుకోలేకపోయారు. వీరిద్దరు తొక్కుడు బాత తొక్కి వెళ్లిపోయారు. కానీ మూడో తాత పాయింట్ కోసం ప్రయత్నించాడు. కానీ ఔట్ అయిపోయాడు.

77 వేలకు పైగా వ్యూస్
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వృద్ధలు కబడ్డి ఆడడం ముచ్చటగా ఉంది. ఈ వీడియోను రాజస్థాని కాక అనే ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. వీడియోతో పాటు शानदार ताऊ भी किसी से कम नही हैं 🙏
అని రాసుకొచ్చారు. ఈ వీడియోకు ఇప్పటి వరకు 77 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. 3741 లైక్స్ వచ్చాయి. 538 రీట్వీట్లు వచ్చాయి.
నెటిజన్లు ఫిదా
ఈ వీడియోలో వృద్ధల ఆట చూసి నెటిజన్లు ఫిదా అయ్యారు. లేటు వయస్సు కూడా చాలా ఉషారుగా ఉన్నారని కామెంట్ చేస్తున్నారు. అయితే ఇది ఎక్కడ జరిగిందో తెలియదు. కానీ ట్విట్టర్ ఖాతాను బట్టి రాజస్థాన్ కు చెందిన వీడియోగా భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications