కన్నింగ్ చెల్లెలి సపోర్టుతో భర్తను చంపేసిన భార్య, అక్రమ సంబంధంతో బాత్ రూమ్ !
బెంగళూరు: కుటుంబ కలహాలతో భర్తను (husband) హత్య చేసి మృతదేహాన్ని ఇంటి సమీపంలోని మరుగుదొడ్డి గుంతలో పడేసిన మృతుడి భార్య, ఆమె చెల్లిని (sister) బెంగళూరు (Bengaluru) నగరంలోని సంపిగేహళ్లి పోలీసులు అరెస్టు చేశారు. కూగిలు లేఔట్‌లో నివాసముంటున్న నజియా ఖాతుమ్, ఆమె సోదరి కాశ్మీరి ఖతుమ్‌లను అరెస్టు చేశామని బెంగళూరు పోలీసులు తెలిపారు. కొద్ది రోజుల క్రితం షకీల్ అక్తర్ ను అతని భార్య (wife) నాజియా ఖాతమ్ హత్య చేసి డ్రామాలు ఆడిందని పోలీసులు తెలిపారు.
దీనిపై పోలీసులు విచారణ చేపట్టి అనుమానంతో మృతుడు షకీల్ అక్తర్ భార్యను (wife)అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. 2018లో బెంగళూరులో (Bengaluru) ప్రైవేట్ కంపెనీ ఉద్యోగి అయిన షకీల్ అక్తర్, నజియా వివాహం చేసుకుని కూగిలు లేఔట్‌లో కాపురం పెట్టి అక్కడే నివాసం ఉంటున్నారు. వివాహం చేసుకున్న తరువాత షకీల్ అక్తర్, నాజియా దంపతులు చాలా సంతోషంగా ఉన్నారు.

రానురాను కుటుంబ కారణాలతో షకీల్, నాజియా దంపతుల మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. ఇదే సందర్బంలో రోజు ఉద్యోగం చెయ్యడానికి వెలుతున్న షకీల్‌కు ఓ వివాహిత మహిళతో అక్రమ సంబంధం (illicit relationship) ఏర్పడింది. ప్రియురాలితో ఎంజాయ్ చేస్తున్న షకీల్ ఇంట్లో అతని భార్య నజియాను చులకనగా చూడటం మొదలు పెట్టాడని ఆరోపణలు ఉన్నాయి, కొంతకాలం తరువాత భర్త షకీల్ అక్రమ సంబంధం విషయం తెలుసుకున్న అతని భార్య నజియా అందుకు అభ్యంతరం చెప్పింది. .
తన ప్రియురాలితో ఎంజాయ్ చెయ్యడానికి తన భార్య నజియా అడ్డుపడుతోందని రగిలిపోయిన షకీల్ రోజూ అతని భార్యను కొడుతూ వేధించేవాడని ఆరోపణలు ఉన్నాయి. తన భర్త షకీల్ నిత్యం తనతో గొడవపడుతున్నాడని నజియా ఆమె సోదరి (sister)కాశ్మీరీకి చెప్పి కన్నీరుమున్నీరైంది. బావ (husband)షకీల్ కు బుద్దిమాటలు చెప్పడానికి అతని మరదలు (sister)కాశ్మీరి అనేక ప్రయత్నాలు చేసి విఫలం అయ్యింది.
ఎవరు ఎన్నిచెప్పినా అక్రమ సంబందం (illicit relationship) పెట్టుకున్న మహిళ మోజులో పడిపోయిన షకీల్ మాత్రం అతని భార్యను చితకబాదుతూనే ఉన్నాడని తెలిసింది. విసిగిపోయిన నజియా ఆమె భర్త (husband) షకీల్ ను చంపాలని నిర్ణయించుకుంది. నజియా ఆమె భర్త హత్యను హత్య చెయ్యాలని అనుకున్న ప్లాన్ ను ఆమె సోదరి (sister) కాశ్మీరికి చెప్పి మీ బావ హత్యకు సహకరించాలని చెప్పింది.

ఈనెల 10వ తేదీన రాత్రి ఇంటికి వెళ్లిన షకీల్ అతని భార్య నజియాతో గొడవపడ్డాడని తెలిసింది. మద్యం మత్తులో ఉన్న షకీల్ తరువాత నిద్రపోయాడు. ఆ సమయంలో నజియా, ఆమె సోదరి (sister) కాశ్మీరి కలిసి షకీల్ గొంతు నులిమి అతనికి ఊపిరిరాకుండా చంపేశారని (muder) పోలీసులు అన్నారు. అర్దరాత్రి దాటిన తరువాత భర్త (husband) షకీల్ మృతదేహాన్ని బెడ్‌షీట్‌లో చుట్టి ఇంటి పమీపంలోని టాయిలెట్ కోసం తీసిన గోతిలో పడేసిన అతని భార్య నజియా, ఆమె సోదరి కాశ్మీరి సైలెంట్ గా ఉండిపోయారు.
ఇంటి (house) పక్కన షకీల్ మృతదేహం కుళ్లిపోయి దుర్వాసన వస్తోందని గమనించిన ప్రజలు కొన్ని రోజులు ఏదో కుక్క, ఎలుకలు చచ్చాయి అనుకుని ముక్కులు మూసుకున్నారు. అయితే రోజురోజుకు దుర్వాసన ఎక్కువ రావడంతో స్థానికులకు అనుమానం వచ్చి బెంగళూరు (Bengaluru) పోలీసులకు సమాచారం అందించారు. తన సోదరుడు షకీల్ అనుమానాస్పదంగా అదృశ్యమయ్యాడని మృతుడి సోదరుడు సంపిగేహళ్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
దీనిపై పోలీసులు (police) విచారణ చేపట్టి అనుమానంతో షకీల్ భార్య నజియాను విచారించగా నిజం ఒప్పుకుంది. నజియా ఇచ్చిన సమాచారంతో ఆమె సోదరి కాశ్మీరిని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. అక్రమ సంబంధం కారణంగా, నిత్యం గొడవలు చేస్తున్నాడనే కోపంతో భార్య చెల్లితో (sister) కలిసి భర్తను (husband) హత్య చెయ్యడం బెంగళూరులో హాట్ టాపిక్ అయ్యింది.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications