మేడమ్ సూపర్, అక్రమ సంబంధం, భర్తకు ఉప్మాలో విషం పెట్టింది, కట్ చేస్తే !
బెంగళూరు: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వివాహం చేసుకున్న తరువాత దంపతులు ఇద్దరూ ఇరు వైపుల బంధువులు, స్నేహితుల ఇళ్లకు వెళ్లి హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఇటీవల ఆ విషయంలో దంపతుల మధ్య తేడా వచ్చింది. అంతే ఉప్మాలో విషం కలిపిన భార్య ఆమె భర్తకు తినిపించడం కలకలం రేపింది.
కర్ణాటకలోని బెళగావి జిల్లాలోని సవదత్తి తాలుకాలోని గోరబాళ గ్రామంలో నింగప్ప హరమాని అలియాస్ నింగప్ప (32) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం నింగప్పకు సవిత (32) అనే యువతితో వివాహం అయ్యింది. వివాహం చేసుకున్న తరువాత నింగప్ప, సవిత దంపతులు చాలా సంతోషంగా హ్యాపీగా కాపురం చేశారు.

నింగప్ప, సవిత దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. సొంత పొలంలో వ్యవసాయం చేయిస్తూ బాగా డబ్బులు సంపాధిస్తున్న నింగప్ప అతని భార్య, పిల్లలను సంతోషంగా చూసుకుంటున్నారు. అయితే కొన్ని సంవత్సరాల నుంచి నింగప్ప అడ్డదార్లు తొక్కుతూ మద్యంకు బానిస అయ్యి అక్రమ సంబందాలు పెట్టుకుని సంపాధిస్తున్న డబ్బులు మొత్తం ఫిగర్లకు, ఆంటీలకు తగలేస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి.
అక్రమ సంబంధాలు పెట్టుకుని, విపరీతమైన మద్యం సవించి ఎంజాయ్ చేస్తున్న నింగప్పను అతని భార్య సవిత ప్రశ్నించింది. ఇదే విషయంలో ఇద్దరి మధ్య గొడవలు మొదలైనాయి. రానురాను పెద్దలు పంచాయితీలు చేసినా దంపతుల మధ్య రాజీ కుదరలేదని తెలిసింది, విసిగిపోయిన సవిత ఆమె సోదరుడు లక్ష్మణ్ సహాయంతో భర్తను చంపేయాలి అని డిసైడ్ అయ్యింది.
సోదరుడు లక్ష్మణ్ సహాయంతో విషం తెప్పించిన సవిత ఉప్మా చేస్తున్న సమయంలో అందులో విషం కలిపేసింది. విషం కలిపిన ఉప్మా భర్త నింగప్పకు మాత్రమే పెట్టిన సవిత తరువాత భర్త చావు కోసం ఎదురు చూసింది. విషం కలిపిన ఉప్మా తిన్న నింగప్ప వాంతులు చేసుకున్నాడు. వెంటనే నింగప్ప కుటుంబ సభ్యులు అతన్ని ఆసుపత్రికి తరలించారు.

నింగప్పకు ఉన్న కోట్ల రూపాయల విలువైన ఆస్తులు అక్రమ సంబంధాలు పెట్టుకున్న వారికి నింగప్ప దానాధర్మం చేస్తాడనే భయంతో ఆ ఆస్తి మొత్తం రాయించుకోవాలని అతని భార్య సవిత ప్లాన్ చేసిందని, అందుకే అతనికి ఉప్మాలో విషం పెట్టి హత్య చెయ్యడానికి ప్రయత్నించిందని పోలీసులు అన్నారు. నింగప్ప భార్య సవితో పాటు ఆమె తమ్ముడు లక్ష్మణ్ ను అరెస్టు చేసి కేసు విచారణ చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications