Cyber Crime: లైక్ చేస్తే రూ.50 అంటూ రూ.13 లక్షలు కొల్లగొట్టారు..
దేశంలో సాంకేతికత ఎంతగా పెరుగుతోందో.. మోసాలు కూడా అదే స్థాయిలో పెరిగిపోతున్నాయి. సైబర్ క్రైమ్ నేరాలు భారీగా పెరుగుతున్నాయి. ఎంతగా అవగాహన కల్పించినప్పటికీ.. ప్రజలు మోసపోతూనే ఉన్నారు. తాజాగా ఓ మహిళ రూ.13 లక్షలు మోసపోయింది. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లోని ఘజియాబాద్ లో జరిగింది. ఘజియాబాద్ కు చెందిన ప్రాచి మాథుర్ అనే మహిళ సైబర్ మోసగాళ్ల చేతి మోసపోయి.. చివరికి పోలీసులను ఆశ్రయించింది.
ప్రాచీ మాథుర్ అదనపు ఆదాయం కోసం ఆన్ లైన్ పార్ట్ టైమ్ జాబుల కోసం వెతికారు. ఈ క్రమంలో ఆమె మొబైల్ కు ఒక మెసేజ్ వచ్చింది. అదనపు ఆదాయం సంపాదించడానికి సులువైన పని ఉందని సందేశంలో పేర్కొన్నారు. కేవలం యూట్యూబ్ వీడియోలకు లైక్ చేయడం ద్వారా డబ్బులు సంపాదించవచ్చని చెప్పారు. ఒక్కో లైక్ కు రూ.50 చెల్లిస్తామని చెప్పారు. ఆమెకు యూట్యూబ్ వీడియోల లింక్ లు పంప్పారు. ఆమె వీడియోలకు లైక్ లు కొట్టగా.. అందుకు సంబంధించిన డబ్బును ప్రాచీ మాథర్ బ్యాంక్ ఖాతాలో జమ చేశారు.

ఇలా కొన్ని రోజులు చేసిన తర్వాత ఆమె ఖాతాలోకి కొంత మొత్తం డబ్బు వచ్చింది. ఆ డబ్బు డ్రా చేసుకోవాలంటే.. వెల్ఫేర్ టాస్క్ లో డబ్బులు పెట్టుబడి పెట్టాలని సూచించారు. దీంతో ఆమె మొదటగా రూ.26, 800 పెట్టుబడి పెట్టారు. ఆ తర్వాత వివిధ దశల్లో రూ.13 లక్షలు పెట్టుబడి పెట్టారు. ఆ తర్వాత సైబర్ నిందితుల నుంచి ఎలాంటి కమ్యూనికేషన్ లేదు. మోసపోయానని తెలుసుకున్న ప్రాచీ.. పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆన్ లైన్ లో ఉద్యోగ అవకాశాలు, లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. LinkedIn, Naukri.com లేదా Indeed వంటి ప్రసిద్ధ జాబ్ పోర్టల్‌ల ద్వారా ఉపాధి అవకాశాలను వెతుక్కోవాలని కోరారు. వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేసేటప్పుడు ఒకటి రెండు సార్లు చెక్ చేసుకోవాలని తేల్చి చెబుతున్నారు. గతంలో కూడా ఇలాంటి మోసాలు జరిగాయి. హైదరాబాద్ కు చెందిన ఓ మహిళ సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఇదే తరహాలో మోసపోయి రూ.లక్షలు పోగొట్టుకున్నారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications