Kurkure: కుర్కురే కొనివ్వలేదని.. భర్తకు విడాకులిచ్చిన మహిళ

లక్నో: ఇటీవల కాలంలో చిన్న చిన్న కారణాలకే తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటూ నిండునూరేళ్ల కాపురాలను కూల్చుకుంటున్నారు. సర్దుకుపోవాల్సిన విషయాల్లోనూ తీవ్రమైన ఆగ్రహం, ఆవేశంతో సరిచేసుకోలేని నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. కుర్కురే కొనివ్వలేదనే చిన్న కారణంతో.. ఓ మహిళ ఏకంగా భర్తకు విడాకులివ్వడం గమనార్హం.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రాలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. గత సంవత్సరం వివాహమైన ఈ జంట ఎంతో అన్యోన్యంగా కాపురం కొనసాగిస్తున్నారు. భార్య అడక్కుండానే ఆమె కోరికలను తీర్చేస్తూ ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాడు. కాగా, తన విధుల నుంచి వచ్చేటప్పుడు భార్యకు స్నాక్స్ తీసుకొస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో ఆమె చిరుతిళ్లకు అలవాటు పడింది.

a woman leaves husband house for kurkure in agra apply for divorce

ఇప్పుడు అదే ఆ భర్త కొంపముంచింది. దాదాపు ప్రతిరోజూ తన భార్య కోసం స్నాక్స్ తీసుకొచ్చే భర్త.. ఇటీవల కాలంలో తీసుకురావడం లేదు. దీంతో దంపతుల మధ్య రోజూ గొడవ జరుగుతూ ఉండేది. ఐదు రూపాయల కుర్కురే కూడా తన కోసం తీసుకురావడం లేదంటూ భర్తతో గొడవ పడుతూ ఉండేది. అయితే, ఎంత చెప్పినా తన కోసం స్నాక్స్ తీసుకురావడం లేదని విసుగెత్తిన ఆమె భర్తపై కోపంతో పుట్టింటికి వెళ్లిపోయింది.

మరోవైపు, పోలీస్ స్టేషన్‌ మెట్లు కూడా ఎక్కారు ఈ దంపతులు. తన భార్య పోరు భరించలేకపోతున్నానని.. ప్రతి రోజూ కుర్కురే తీసుకురావాలని గొడవ చేస్తోందని పోలీసుల ముందు మొరపెట్టుకున్నాడు భర్త. ఎంత చెప్పినా తన అలవాడు మార్చుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో ఆ భార్యాభర్తలకు స్టేషన్ కు పిలిపించి కుటుంబ సలహా కేంద్రం వారితో కౌన్సెలింగ్ ఇప్పించారు. అయినప్పటికీ వారిలో మార్పు రాలేదు. ఇక తన భర్తతో విడాకులిప్పించాల్సిందేనని ఆమె దరఖాస్తు చేసుకుంది. కుర్కురేకు ఆమె బాగా అలవాటుపడిందని.. దీంతోనే ఆమె విడాకులు తీసుకుంటోందని పోలీసులు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+