ప్రేమ పెళ్లి, అమ్మా, నాన్నతో కలిసి భర్తనే చంపేసింది, పాపను చూడటానికి వెళ్లి !

బెంగళూరు: ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తను అతని భార్య అమ్మా నాన్నలతో కలిసి హత్య చేసిన ఘటన కర్ణాటకలోని బెళగావి నగరంలో జరిగింది. బెళగావిలోని లక్ష్మీ నగర్ లో నివాసం ఉంటున్న కిరణ్ లోకెరె (28) అనే వ్యక్తి హత్యకు గురైనాడు.

లక్ష్మీ నగర్ లో కిరణ్, సవితా నివాసం ఉండేవారు. ఒకే వీదిలో నివాసం ఉండే కిరణ్, సవితా చాల సంవత్సరాలు ప్రేమించుకున్నారు. ఐదు సంవత్సరాల క్రితం కిరణ్, సవితా ప్రేమ వివాహం చేసుకున్నారు. కిరణ్, సవితా దంపతులకు ఓ పాప ఉంది.

 A woman murdered her husband along with her parents in Lakshmi Nagar in Belagavi.

ఒక సంవత్సరం క్రితం కిరణ్, సవితా దంపతుల మధ్య అభిప్రాయవిభేదాలు వచ్చాయి. కిరణ్, సవితా దంపతులు ఇద్దరూ వేర్వేరుగా నివాసం ఉంటున్నారు. సవితా దగ్గర పాప ఉంది. శుక్రవారం సవితా పాపను తీసుకుని లక్ష్మీ నగర్ లో నివాసం ఉంటున్న తల్లిదండ్రుల ఇంటికి వచ్చింది.

విషయం తెలుసుకున్న కిరణ్ పాపను చూడటానికి సవితా తల్లిదండ్రుల ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో కిరణ్, సవితాల మధ్య మాటామాటా పెరిగింది. ఆ సమయంలో సహనం కొల్పోయిన సవితా తల్లిదండ్రులతో కలిసి ఇనుప రాడ్ తీసుకుని కిరణ్ తల మీద చితకబాదడంతో అతను మరణించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సవితా, ఆమె తల్లిదండ్రులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+