ప్రేమ వివాహం, మహిళా టెక్కీ ఆత్మహత్య, వారం క్రితం చిన్నారి నామకరణం, వరకట్నం కోసం !

బెంగళూరు: జీవితంపై వరక్తి పెంచుకున్న మహిళా టెక్కీ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన బెంగళూరు నగరంలో జరిగింది. బెంగళూరులోని జేపీ నగర పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న సుప్రియా అనే మహిళా సాఫ్ట్ వేర్ ఇంజనీరు ఆత్మహత్య చేసుకుందని మంగళవారం పోలీసులు అన్నారు.

నాలుగు సంవత్సరాల క్రితం సుప్రియా, అక్షయ్ ప్రేమ వివాహం చేసుకున్నారు. సుప్రియా, అక్షయ్ దంపతులకు పాప ఉంది, అక్షయ్ కూడా సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా ఉద్యోగం చేస్తున్నారు. వారం క్రితం సుప్రియా, అక్షయ్ దంపతులు పాపకు ఘనంగా నామకరణం చేశారు.

A woman techie Supriya Hang herself Committed suicide in Bengaluru

చిన్న విషయంలో సుప్రియా, అక్షయ్ గొడవపడ్డారని సమాచారం. సోమవారం అక్షయ్ ఉద్యోగానికి వెళ్లాడు. ఇంటిలో ఒంటరిగా ఉన్న సుప్రియా సోమవారం రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇంటికి వచ్చిన అక్షయ్ విషయం గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సుప్రియా కుటుంబ సభ్యులు అక్షయ్ మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రతినిత్యం వరకట్నం కోసం అక్షయ్ సుప్రియాను వేదింపులకు గురి చేశాడని, అందుకే ఆమె ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్షయ్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని, కేసు దర్యాప్తులో ఉందని జేపీ నగర పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+