Indore: మహిళకు అరుదైన శస్త్ర చికిత్స.. కడుపులోంచి 15 కిలోల కణితిని బయటకు తీసిన వైద్యులు..

కడుపు నొప్పితో బాధపడుతున్న ఓ మహిళ కడుపు నుంచి 15 కిలోల కణితిని వైద్యులు తొలగించారు. మ‌ధ్యప్రదేశ్‌లోని ఇండోర్ ఓ మహిళకు శస్త్ర చికిత్స చేసి కణితిని బయటకు తీశారు. ఓ మహిళ కడుపు నొప్పితో ఇండోర్ లోని ఇండెక్స్ ఆస్పత్రిలో చేరారు. డజనుకు పైగా వైద్యులు, సహాయక సిబ్బందితో కూడిన బృందం 41 ఏళ్ల మహిళ పొత్తికడుపు నుంచి ప్రాణాంతక కణితిని తొలగించారు. ఈ కణితి తొలగించడానికి రెండు గంటల సుదీర్ఘ శస్త్రచికిత్సను నిర్వహించారు.

కణితి భారీగా ఉండడంతో పాటు ఆహారం తిన్నప్పుడు, నడిచేటప్పుడు కూడా రోగికి ఇబ్బంది కలుగుతున్నందున వైద్య ప్రక్రియ చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు సర్జన్ల బృందంలో భాగమైన డాక్టర్ అతుల్ వ్యాస్ తెలిపారు. ఏదైనా పొరపాటు జరిగితే ప్రాణాపాయం జరిగే అవకాశం ఉన్నందున శస్త్రచికిత్స చేసేటప్పుడు బృందం చాలా జాగ్రత్తగా ఆపరేషన చేసినట్లు చెప్పారు. కణితి అనేక నరాలను కప్పివేసిందన్నారు. అందుకే శస్త్ర చికిత్సకు చాలా సమయం పట్టిందన్నారు.

A woman underwent surgery in Indore and a 15 kg tumor was removed from her stomach

మహిళ బరువు 49 కిలోలు కాగా.. 15 కిలోల ట్యూమర్‌ని ఆమె లోపల మోసిందని వైద్యులు తెలిపారు. దీంతో ఆమె కడుపులో వాపు వచ్చిందన్నారు. కొద్ది రోజులు ఆగితే కణితి పగిలి ఆమె ప్రాణం పోయే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం ఆ మహిళ క్షేమంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఇండెక్స్ ఆసుపత్రికి వచ్చే ముందు వారు మహిళను అనేక ఆసుపత్రులకు తీసుకెళ్లారని రోగి కుటుంబ సభ్యుడు తెలిపారు. అండాశయ కణితి కనుగొనబడినప్పుడు, వైద్యులు శస్త్రచికిత్స అవసరమని కుటుంబ సభ్యులకు చెప్పారు.

వైద్యుల కృషిని ఆస్పత్రి ఛైర్మన్ సురేశ్‌సింగ్ బదౌరియా, వైస్‌ చైర్మన్‌ మయాంక్‌రాజ్‌ సింగ్‌ బదౌరియా ప్రశంసించారు. కొన్నేళ్ల క్రితం ముంబైలో ఓ వ్యక్తికి అరుదైన ద్వైపాక్షిక చేతి మార్పిడి శస్త్రచికిత్స జరిగింది. 22 ఏళ్ల యువకుడు ఘోర ప్రమాదంలో తన రెండు చేతులు, కాళ్లను కోల్పోయాడు.
సంక్లిష్టమైన ద్వైపాక్షిక చేతి మార్పిడి శస్త్రచికిత్స దాదాపు 13 గంటల పాటు కొనసాగింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+