బుర్కా వేసుకుని బార్ కు వెళ్లి బీరు బాటిల్స్ తీసుకున్న మహిళ, కట్ చేస్తే, వైరల్ వీడియో !
ముజఫరాబాద్/లక్నో: ముస్లీం మహిళలు బుర్కా వేసుకుని బయటకు రావాలని ముస్లీం మత పెద్దలు కొందరు అంటున్నారు. బుర్కా వేసుకోవడం, వేసుకోకపోవడం మహిళల ఇష్టం అని అదే ముస్లీం మతానికి చెందిన కొందరు మత పెద్దలు అంటున్నారు. బుర్కా వియంలో ఇటీవల కాలంలో లేనిపోని రాద్దాంతాలు జరిగిన వియం తెలిిందే. ఇప్పుడు బుర్కా వేసుకున్న మహిళ తల నరికేస్తామని అదే ముస్లీం మతానికి చెందిన ముగ్గురు బెదిరించారు.
బుర్కా ధరించి బీర్లు కొనేందుకు వచ్చిన మహిళను బెదిరించిన ముగ్గురు నిందితులను ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌పూర్‌లో బుర్కా ధరించిన ముస్లిం యువతి మద్యం కొనుగోలు చేసేందుకు బార్‌కు వెళ్లింది. ఇది గమనించిన క్రిమినల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న ఇద్దరు సోదరులు, మరొకరు ఆమెను మార్గం మధ్యలో ఆమెను అడ్డుకుని బూతులు తిట్టారు.

నీవు ముస్లింగా ఉండటానికి సిగ్గు లేదా? బుర్కా వేసుకుని మద్యం కొంటున్నావా? బుర్కా కట్టుకుని, చీర కట్టుకుని వచ్చి మద్యం కొనుగోలు చేసి హిందువుల ముందు మమ్మల్ని అవమానిస్తావా, నువ్వు హిందువా ?, లేక ముస్లింవా అనే విషయం ముందు తేల్చి చెప్పు అంటూ ఆమెకు నడిరోడ్డులో అనేక ప్రశ్నలు వేశారు. ఆ సమయంలో బుర్కా వేసుకున్న మహిళను నడిరోడ్డు మీద అందరి ముందు అవమానించారు.
ఇది కేవలం బీరు మాత్రమే అని బుర్కా వేసుకున్న మహిళ ముగ్గురు వ్యక్తులకు చెప్పిందిజ బీరు ఎలా ఉంటుందో చూశావా, నీకు బీరు తాగే అలవాటుకూడా ఉందా, బీరు కొనడానికి చిన్న పిల్లాడిని వెంట తీసుకొచ్చావా, ఇంకోసారి ఇలాగే జరిగితే నీ తల నరికేస్తామని బుర్కా వేసుకున్న మహిళను ముగ్గురు నిందితులు బెదిరించారు. బుర్కా వేసుకున్న మహిళను ముగ్గురు నిందితులు బెదిరిస్తున్న సమయంలో కొందరు తీసిన ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సుమోటో కేసు నమోదు చేసిన పోలీసులు9 ఈ బెదిరింపు కేసుకు సంబంధించి ముగ్గురిని అరెస్ట్ చేశారు. బాకు అలియాస్ షాహన్వాజ్ (40), ఆదిల్ అహ్మద్ (30), సాజిద్ అహ్మద్ (35) అనే నిందితులను అరెస్టు చేశామని పోలీసు అధికారులు తెలిపారు. అరెస్టు అయిన నిందితులు అదే ప్రాంతంలో నివాసం ఉంటున్నారని పోలీసులు అనన్నారు. రెండు నిమిషాలు ఉన్న ఆ వీడియోలో నువ్వు వైన్ ఎందుకు కొంటున్నావు, ఇంకోసారి బీర్లు కొనడానికి బార్ దగ్గరకు వస్తే నీ తల నరికేస్తామని, ఇప్పటికే నేను చాలాసార్లు జైలుకు వెళ్లి వచ్చానని ఓ నిందితుడు ఆమెను బెదిరించిన సమయంలో తీసిన వీడియో లీక్ అయ్యింది.
ఈ ఘటనకు సంబంధించి ముజఫర్‌పూర్ డీసీపీ విక్రమ్ ఆయుష్ స్థానిక మీడియాతో మాట్లాడుతూ ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరిగిందని, స్వయంప్రేరితంగా మేమే కేసు నమోదు చేసి నిందితులపై కేసు నమోదు చేసి వారిని అరెస్టు చేశామని అన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారనే ఆరోపణలపై ముగ్గురిని అరెస్టు చేశారు. ఈ ఘటనపై మహిళ ఎలాంటి ఫిర్యాదు చేయలేదని పోలీసు అధికారులు తెలిపారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications