తమ్ముడు శత్రువును చంపడానికి అక్క భారీ ప్లాన్, ఎవరు చిక్కితే వాళ్లు !

చెన్నై/ మదురై: పగ తీర్చుకునేందుకు ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తమ్ముడి ఫ్రెండ్ ను ఒంటరిగా పిలిచి చంపేందుకు ప్రయత్నించిన కేసులో యువతి సహా నలుగురు వ్యక్తులు అరెస్టయ్యారు. తమిళనాడులోని మదురైలోని కరిమేడు ప్రాంతానికి చెందిన యువకుడు వినీత్ కుమార్, అదే ప్రాంతానికి చెందిన జాక్స్ మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి.

కొన్ని నెలల క్రితం వినీత్‌కుమార్ హత్యాయత్నం చెయ్యడంతో జాక్స్ తప్పించుకున్నాడు. వినీత్ కుమార్ తనను చంపడానికి ప్రయత్నించాడని తెలుసుకున్న జాక్స్ అతని సోదరి అనూషాకు ఆ మ్యాటర్ గురించి చెప్పాడు. ఇది విని కోపోద్రిక్తులైన అనూషా తన సోదరుడిని చంపడానికి ప్రయత్నించిన వినిత్‌కుమార్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటుంది.

women1

ఇందుకోసం భర్తతో కలిసి అనూషా హత్యకు ప్లాన్ వేసింది. ఆ తర్వాత నకిలీ పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో అనూషా ఓ ఖాతా ప్రారంభించింది. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వినీత్‌కుమార్‌కు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించింది. తాను కోయంబత్తూర్‌లో నర్సింగ్‌ చదువుతున్నానని చెప్పిన అనూషా గత కొంత కాలంగా వినిత్‌కుమార్‌తో ప్రతిరోజూ మాట్లాడుతోంది.

ఈ క్రమంలో ఈనెల 6వ తేదీన తన స్నేహితురాలితో కలిసి మధురైకి వచ్చానని వినిత్ కుమార్ కు అతని సోషల్ మీడియా ఫ్రెండ్ అనూషా ఆమె చెప్పింది. మదురైలోని బీబీకులం ప్రాంతంలోని ఓ కమర్షియల్ కాంప్లెక్స్ కు రావాలని, అక్కడే తనను కలవాల్సిందిగా అనూషా వినీత్‌కుమార్‌ కు చెప్పింది. వినీత్‌కుమార్‌ను తనకు ఎవరూ తెలియని వ్యక్తులు ఉండే ప్రాంతానికి పిలిచిన అనూషాను కలవడానికి వెళ్లాడు.

police

అక్కడ అనూషా భర్త జానీ మురుగన్ మరియు అతని స్నేహితుడు తిరుపతి వారు దాచిన కత్తులు, కొడవలితో అతని మీద దాడి చేశారు. తీవ్రగాయాలైన వినీత్‌కుమార్ కేకలు వేయడంతో అనూ ఆమెషా, ఆమె భర్త అక్కడి నుంచి పారిపోయారు. తీవ్రంగా గాయపడిన వినీత్ కుమార్ అతపని మొబైలక ఫోన్ నుంచి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఈ ఘటనపై తాళ్లకుళం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. జాక్స్ సోదరి అనూషా ఇన్‌స్టాగ్రామ్‌లో నకిలీ ఖాతా ద్వారా వినీత్‌కుమార్‌ను ప్రేమిస్తున్నట్లు నటించి హత్య చేసేందుకు ప్లాన్ చేసిందని పోలీసుల విచారణలో తేలింది. అనంతరం అనూషా, ఆమె భర్త జానీ మురుగన్, అనూషా స్నేహితురాలు శరణ్యా, ఆమె బాయ్ ఫ్రెండ్ తిరుపతిని కూడా అరెస్టు చేశామని పోలీసు అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+