అక్రమ సంబంధం, ప్రియుడిని బ్లాక్ మెయిల్ చేసింది, నావల్ల కాదని అర్దరాత్రి ?
అక్రమ సంబంధం పెట్టుకుని తనతో ఇంతకాలం ఎంజాయ్ చేసి ఇప్పుడు తనపై తప్పుడు అత్యాచారం కేసు నమోదు చేస్తారనే భయంతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. యువకుడిని బెదిరించి అతనితో బలవంతంగా అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళ మరో మగాడితో కలిసి బ్లాక్ మెయిల్ చెయ్యడంతో ఆ యువకుడు భయపడిపోయాడు.
ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో తీసిన యువకుడు అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళతో పాటు పోలీసులపై తీవ్ర ఆరోపణలు చేశాడు. యువకుడి ఆత్మహత్యపై మురాద్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆత్మహత్యకు ప్రేరేపించారనే అభియోగం కింద ఓ మహిళ సహా ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

విషం తాగి ఆత్మహత్య చేసుకున్న యువకుడి పేరు సలీం.
మురాద్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుల్తాన్‌పూర్ గ్రామానికి చెందిన సలీం అతని మొబైల్‌లో రెండు సెల్ఫీ వీడియోలు తీసుకుని విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ వీడియోలో తన ఆత్మహత్యకు గల కారణాన్ని సలీం వివరించాడు. నేను మూడు రోజులు అడవిలో ఉన్నాను. ఇక నేను అడవిలో తిరుగుతూ తప్పించుకుని పారిపోలేనని, తనకు అంత ఓపిక కూడా లేదని సలీం వాపోయాడు. తాను చనిపోవాలనే నిర్ణయానికి వచ్చానని సలీం ఆ వీడియోలో తెలిపాడు.
సెల్ఫీ వీడియోలో సలీం రియల్ ఎస్టేట్ డీలర్ అస్లాం లియాఖత్, తనతో అక్రమ సంబంధం పెట్టుకున్న ఆ మహిళ నన్ను తప్పుడు కేసులో ఇరికిస్తామని బెదిరించారని, ఆ మహిళ, ఆమె తల్లి రాత్రి నాకు ఫోన్ చేసి చంపేస్తామని బెదిరించారని, భయంతో ఊరు విడిచి అడవికి చేరానని, పరుగు పరుగున చాలా దూరం వచ్చానని, నేను ఇక పరిగెత్తలేనని, అందుకే ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నానని సలీం ఆ వీడియోలో ఆరోపించాడు.
నాకు న్యాయం కావాలి, నేను విషం తీసుకుని ఆత్మహత్య చేసుకుంటున్నానని సలీం బోరున విలపించాడు.
ఏడాది క్రితం తనకు పరిచయమైన షబానా అనే మహిళ నా ఆత్మహత్యకు ప్రధాన కారణ: అని సలీం ఆరోపించాడు
ఏడాది క్రితం సలింకి షబానా అనే మహిళ పరిచయమైంది. షబానా వివాహమైంది, తన సవతి కూతురిపై తన భర్త అత్యాచారం చేశాడని షబానా పోలీసుకు ఫిర్యాదు చేసింది. ఈ కేసులో షబానా భర్త జైలు పాలయ్యాడు.
ఈ సమయంలో షబానాతో సలీం సన్నిహితంగా ఉండేవాడు. తనతో సంబంధాలు పెట్టుకోవాలని షబానా సలీమ్‌పై ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. సలీం నిరాకరించడంతో షబానా తప్పుడు కేసు పెట్టి తన కూతురుతో పాటు జైలుకు వెళ్లేస్తానని బెదిరించింది. జైలుకు వెళ్లాలనే భయంతో సలీం ఊరు వదిలి అడవిలోకి ప్రవేశించాడు. ఇప్పుడు సలీం ఆత్మహత్య చేసుకోవడంతో షబానా, రియల్ ఎస్టేట్ వ్యాపారి అస్లాం లియాఖత్ పరారైనాడని, వారి కోసం గాలిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications