Viral Video: కబడ్డి ఆడుతూ ప్రాణాలు కోల్పోయిన యువకుడు.. అతను గెలిచిన కప్ లతో పాటు ఖననం..

సోషల్ మీడియా వచ్చిన నుంచి ప్రపంచం ఒకు కుగ్రామంగా మారిపోయింది. ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు. సోషల్ మీడియాలో చాలా వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఆ వీడియోలు మనకు సంతోషాన్ని ఇవ్వొచ్చు. కోపాన్ని తెప్పించ్చొచ్చు. బాధను కలిగిచొచ్చు. అయితే సోషల్ మీడియాలో పెట్టిన ఓ వీడియో ప్రతి ఒక్కరిని కదిలించింది.

పైకి లేచే ప్రయత్నం చేసినా

పైకి లేచే ప్రయత్నం చేసినా

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియో చూసిన వారందరూ విచారం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియోలో ఓ యువకుడు కబడ్డి ఆడుతూ కన్నుమూశాడు. కబడ్డి ఆటలో కూతకు వచ్చిన అతన్ని ప్రత్యర్థి జట్టు సభ్యులు పట్టుకునే క్రమంలో మీద పడగా ఆగిపోయాడు. ఆ తర్వాత పైకి లేచే ప్రయత్నం చేసినా సాధ్యం కాలేదు.

మైదానంలోనే..

మైదానంలోనే..

సహచరులు వచ్చి లేపిన లేవలేదు. అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో అక్కడ విషాదఛాయలు నెలకొన్నాయి. అయితే అతని సహచరులు, కుటుంబ సభ్యులు అతను సాధించిన కప్ లతో పాటు అతన్ని ఖననం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

చరిత్ర ఎప్పటికీ మరవదు..

ఈ వీడియోను మహ్మద్ గౌస్ అనే వ్యక్తి పోస్ట్ చేశాడు. ఆటల్లో గెలవడం ఓడిపోవడం అనేది సాధారణమైనది. కానీ ఆట కోసమే ప్రాణాలు కూడా వదిలిన క్రీడాకారులను చరిత్ర ఎప్పటికీ మరవదు అని రాసుకొచ్చాడు. ఈ వీడియో నెటిజన్లు కూడా విచారం వ్యక్తం చేశారు. Kosa gove ka pleyar unni ఒకరు కామెంట్ చేశారు. అయితే ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+