ఫేమస్ కాలేజ్ అమ్మాయిల ముందు ప్యాంట్ జిప్ విప్పేసి ?, బైక్ నెంబర్ మూసేసి !
బెంగళూరులోని వీవీ పురంలోని ఓ ప్రతిష్టాత్మక కాలేజ్ ముందు నిల్చున్న అమ్మాయిల ముందు ఓ వికృత వ్యక్తి అతని ప్యాంట్‌ను విప్పి తన ప్రైవేట్ పార్ట్‌ను చూపించిన జుగుప్సాకరమైన సంఘటన వెలుగులోకి రావడం కలకలం రేపింది. కాలేజీ ముందు నిల్చున్న అమ్మాయిల గుంపు దగ్గరికి స్కూటర్ పై వచ్చిన ఓ యువకుడు అతని ప్యాంట్ జిప్ విప్పి ప్రైవేట్ పార్ట్ చూపించి అక్కడి అమ్మాయిలను ఎగతాలి చేసి అక్కడి నుంచి పరారయ్యాడు.
దీనికి సంబంధించి బెంగళూరు పోలీసులను ట్యాగ్ చేసి ఆ వీడియోను పోస్టు చేసిన కొందరు నిందుతుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు. ఈ వీడియోపై వ్యాఖ్యానించిన నెటిజన్లు ఇది కాలేజ్ అమ్మాయిలకు చాలా అవమానకరం అయిన సంఘటన, వీలైనంత త్వరగా అతన్ని అరెస్టు చేయాలని మనవి చేస్తున్నారు. ఆ కామాంధుడి స్కూటర్ నంబర్ స్పష్టంగా కనిపిస్తుందని, కానీ అతను స్కూటర్ నెంబర్ ప్రారంభంలోని రెండవ నంబర్‌ను కనపడకుండా మూసివేసాడని అంటున్నారు.

కాలేజ్ అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన అతనిని వెంటనే అరెస్టు చేయాలని చాలా మంది నెటిజన్లు డిమాండ్ చేశాడు. అమ్మాయిలకు ఇలాంటి సంఘటనలు చాలా సార్లు ఎదురౌతున్నాయని, ఇప్పటికే ఇలాంటి సంఘటనలు జరిగాయని, మా ఇంటి దగ్గర ఉన్న అమ్మాయిలు ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారని, దయచేసి మాకు సహాయం చేయండి అని మరొకరు బెంగళూరు పోలీసులకు మనవి చేశారు.
బెంగళూరు సిటీలోని వీవీపురంలోని ప్రముఖ కాలేజ్ లో చదువుతున్న అమ్మాయిలకు లైన్ వెయ్యడానికి ఇతర ప్రాంతాలకు చెందిన యువకులు అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. బెంగళూరులోని వీవీపురంలోని ఆ కాలేజ్ ప్రారంభం అయినప్పుడు, కాలేజ్ వదిలే సమయంలో ఇతర ప్రాంతాలకు చెందిన యువకులు బైకుల్లో అక్కడికి వెళ్లి నానా హంగామా చేస్తున్నారు. వీవీపురం పోలీసులు సైతం కాలేజ్ వదిలే సమయంలో ఆ ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహించి అకతాయిలకు బుద్ది చెప్పిన సంఘటనలు ఇంతకు ముందు జరిగాయి.
అయినా వీవీపురం కాలేజ్ అమ్మాయిలతో తిక్క చేష్టలు చేసే యువకుల సంఖ్య ఏమాత్రం తగ్గడంలేదు. అయితే ఇప్పుడు స్కూటర్ లో వచ్చిన ఓ యువకుడు ఏకంగా అమ్మాయిల ముందు ప్యాంట్ జిప్పు తీసి వారికి అతని మర్మాంగం చూపించి అక్కడి నుంచి వెళ్లిపోవడం కలకలం రేపుతోంది. నిందితులను వెంటనే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆ కాలేజ్ అమ్మాయిల కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications