Viral News: 10 రోజుల్లో 5 సార్లు కాటేసిన పాము.. అయినా బతికిన యువకుడు..
పాములు పగ పడతాయా.. ఈ సందేహం చాలా మందికి ఉంటుంది. అయితే ఓ వ్యక్తిని పాము 10 రోజుల్లో 5 సార్లు కాటు వేసింది. ఉత్తర్ ప్రదేశ్ లోని ఆగ్రా జిల్లా మన్కేఢా గ్రామానికి చెందిన 20 ఏళ్ల రజత్ చాహర్ ను పాము 10 రోజుల్లో 5సార్లు కాటు వేసింది. అయితే ఈ ఐదు సార్లు అతను ప్రాణాలతో బయటపడ్డాడు. పాము ఎందుకు అతడినే టార్గెట్ చేసి కాటు వేస్తుందో తెలియడం లేదని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రజత్ చాహర్ స్థానికంగా ఉన్న కాలేజీలో డిగ్రీ చదువుతున్నాడు. అతను ఈనెల 6న రాత్రి 9 గంటలకు ఇంటి బయట ఉన్న సమయంలో ఎడమ కాలిపై పాము కాటు వేసింది. రజత్ ను హుటాహుటిన నాటు వైద్యుడి దగ్గరకు తీసుకెళ్లారు. తర్వాత ఆస్పత్రిలో తరలించారు. అయితే పాము కాటు లక్షణాలేవీ కనిపించడం లేదని అతన్ని డిశ్చార్జ్ చేశారు.

రజత్ సెప్టెంబర్ 8న సాయంత్రం ఇంటి బయట ఉన్న బాత్రూమ్ కు వెళ్లినప్పుడు అతడి పాము మరోసారి కాటు వేసింది. అతడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఆ తర్వాత ఈనెల 11న ఇంట్లో ఉండగా ఓ సారి, ఈనెల 13న బాత్ రూంలో మరోసారి పాము కాటు వేసింది. ఆ తర్వాత ఈనెల 14న చెప్పులు వేసుకుంటుండగా పాము మళ్లీ కాటు వేసింది.
పాము కరిచిన ప్రతీసారి అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్సఅందించారు. అయితే పాము ప్రతీసారి అతని ఎడమ కాలిపైనే కాటు వేస్తుంది. అయితే పాము అతడిని అక్కడే ఎందుకు కాటు వేస్తుందో ఎవరికి అర్థం కావడం లేదు.












Click it and Unblock the Notifications