దుబాయ్ లో అన్న, వదినా అంటూ వెనుకనే ?, రాత్రి అన్న భార్య, పిల్లలను మరిది ఏం చేశాడంటే!
వివాహం చేసుకున్న వ్యక్తి అతని భార్యతో సంతోషంగా కాపురం చేశాడు, వివాహం చేసుకున్న తరువాత కొన్ని సంవత్సరాలు భార్యతో కాపురం చేసిన భర్త తరువాత దుబాయ్ లో ఉద్యోగం చెయ్యడానికి సిద్దం అయ్యాడు. దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్త దుబాయ్ లో ఉన్నాడు. ఊరిలో ఉంటున్న భార్య, ఇద్దరు పిల్లలను భర్త సొంత తమ్ముడు దారుణంగా హత్య చెయ్యడంతో అందరూ హడలిపోయారు.
కర్ణాటకలోని హావేరి జిల్లాలోని హానగల్ తాలుకాలోని యళ్లూరు గ్రామంలో హోన్నేగౌడ, మరిగౌడ అనే సోదరులు ఉంటున్నారు. 13 ఏళ్ల క్రితం హోన్నేగౌడకు వివాహం చెయ్యాలని అతని తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూశారు. చివరికి గీతా (32) అనే మహిళతో హోన్నేగౌడ వివాహం జరిగింది. హోన్నేగౌడ, గీతా దంపతులు సంతోషంగా కాపురం చేశారు.

హోన్నేగౌడ, గీతా దంపతులకు అకుల్ (10) అనే కుమారుడు, అంకిత (7) అనే కుమార్తె ఉన్నారు. హోన్నేగౌడ దుబాయల్ లో ఉద్యోగం చెయ్యడానికి వెళ్లాడు. గీతా ఆమె ఇద్దరు పిల్లలతో కలిసి భర్త హోన్నేగౌడ తల్లిదండ్రుల ఇంటిలోనే ఉంటున్నది. ఇదే ఏడాది మొదట్లో హోన్నేగౌడ సొంతఊరికి వచ్చి రెండు నెలలు భార్య, పిల్లలతో కలిసి సంతోషంగా గడిపి తరువాత మళ్లీ దుబాయ్ వెళ్లిపోయాడు.
సంవత్సరం క్రితం వరకు మరిగౌడ అతని అన్న భార్య గీతాతో చాలా క్లోజ్ గా ఉండేవాడని తెలిసింది. అయితే కొంతకాలంగా అన్న హోన్నేగౌడ భార్య, గీతాకు, మరిగౌడ (మరిది) మద్య గొడవలు జరగుతున్నాయని తెలిసింది. శుక్రవారం రాత్రి గీతాతో ఆమె మరిది మరిగౌడ గొడవపడ్డాడు. ఆ సమయంలో కుటుంబ సభ్యులు, బంధువులు మరిగేడకు సర్దిచెప్పి అక్కడి నుంచి పంపించేశారు.
అయితే రాత్రి మద్యం సేవించి వెళ్లిన మరిగౌడ తరువాత మళ్లీ అతని వదిన గీతాతో గొడవ పెట్టుకున్నాడు. ఆ సందర్బంలో సహనం కోల్పోయిన మరిగౌడ కొడవలి తీసుకుని అతని వదిన గీతా, అన్న పిల్లలు అకుల్, అంకితను దారుణంగా నరికి చంపేశాడు. ముగ్గురిని హత్య చేసిన మరిగౌడ బంధువులు, గ్రామస్తులకు చిక్కకుండా అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయాడు. వదిన గీతా, ఆమె ఇద్దరు పిల్లల హత్యలకు కచ్చితమైన కారణాలు తెలియడం లేదని, దుబాయ్ నుంచి గీతా భర్త మరిగౌడ వచ్చిన తరువాత అసలు విషయం తెలుస్తుందని, కేసు విచారణలో ఉందని హావేరి జిల్లా పోలీసు అధికారులు తెలిపారు.
-
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications