రేయ్ అన్నయ్య నీ భార్యకు ?, అన్నదమ్ముల గొడవతో పక్కింటోడు ఏమయ్యాడంటే !

బెంగళూరు: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ యువకుడిని అతని బంధువు ఇనుప రాడ్‌తో తలపై కొట్టి హత్య చేసిన సంఘటన మాగడి రోడ్డు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. గోపాల్‌పురకు చెందిన సోను పాషా (24) హత్యకు గురైనాడు. ఈ కేసుకు సంబంధించి మృతుడి బంధువు శ్రీరాంపుర సమీపంలోని రామచంద్రాపురకు చెందిన ఫారూఖ్ పాషాను అరెస్టు చేశారు.

కుటుంబ కలహాల నేపథ్యంలో గోపాల్‌పురలోని అతని మామ రియాజ్‌ పాషాకు చెందిన గుజరీ దుకాణంలో మంగళవారం రాజీ జరిగింది. ఈ సమయంలో పెద్దనాన్న కుమారుడు సోనుపై ఫారూక్‌ దాడి చేశాడు. ఈ ఘటనలో సోను తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే కుటుంబ సభ్యులు సోనూను సమీపంలోని విక్టోరియా ఆస్పత్రిలో చేరారు.

A young man who spoke ill of his wife was attacked and killed with an iron rod in Bengaluru.

అయితే చికిత్స విఫలం కావడంతో ఫారుక్ తుదిశ్వాస విడిచినట్లు పోలీసులు తెలిపారు. గోపాల్‌పురకు చెందిన సోను పాషా, ఫారూఖ్‌ పాషా, అక్రమ్‌ పాషా అన్నదమ్ములు కాగా ఇటీవల కుటుంబ సమస్య కారణంగా బంధువుల మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. తరువాత ఫారుక్, అక్రమ్, సోనూ కుటుంబాలు గొడవలు పడి విడిపోయాయి.

మూడు రోజుల క్రితం ఫారూక్ తన బంధువు అక్రమ్‌కు ఫోన్ చేసి నీ భార్య చెడిపోయిందని, ఆమెకు లేనిపోని రోగాలు ఉన్నాయని, ఆమె ఆరోగ్యం బాగోలేదని నోటికి వచ్చినట్లు వాగాడని తెలిసింది. ఈ మాటలతో కోపోద్రిక్తులైన అక్రమ్ దంపతులు ఫారూక్ ఇంటికి వెళ్లి అతన్నిచెప్పుతో కొట్టారు. ఈ గొడవ గురించి తెలుసుకున్న మామ రియాజ్ పాషా తన దుకాణంలో బంధువుల మధ్య రాజీ కుదిర్చాడు. ఆ సందర్బంలో అక్రమ్‌తో పాటు సోనూ కూడా గుజరి షాపులోకి వెళ్లాడు.

A young man who spoke ill of his wife was attacked and killed with an iron rod in Bengaluru.

సోనూ, ఫారూక్‌ల మధ్య చిన్న గొడవ జరిగి చివరికి మాటల యుద్దం జరిగి పరిస్థితి విషమించింది. ఆ సందర్బంలో సహనం కోల్పోయిన సోనూ అతని బంధువు ఫారుక్ తల్లి మీద దాడి చేశాడు. అదే సమయంలో ఫారుక్ అక్కడి గుజరి షాపులో ఉన్న ఇనుపరాడ్ తీసుకుని సోనూ తల మీద దాడి చేశాడు. తలకు తీవ్రగాయాలు కావడంతో వెంటనే సోనూను విక్టోరియా ఆసుపత్రికి తరలించారు.

అయితే చికిత్స విఫలమై సోనూ చనిపోయాడని పోలీసులు అన్నారు. ఫారుక్ ను అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు. భార్య గురించి చెడ్డగా మాట్లాడిన వ్యక్తిని వదిలేసి అతని బంధువు సోనును హత్య చెయ్యడం బెంగళూరు నగరంలో కకలం రేపింది. మొత్తం మీద ఎవడో వాగిన మాటలతో మరో వ్యక్త ప్రాణం పోయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+