భార్య చేతివాటం, పబ్ ల్లో, ఆంటీలతో ఎంజాయ్ చేస్తున్న ఇన్ ఫార్మర్, వీడి స్కెచ్ తో మైండ్ బ్లాక్ !

బెంగళూరు పోలీసుల కనుసన్నల్లో తిరుగుతూ ఎవ్వరికి అనుమానం రాకుండా ఇంట్లో దొంగతనం చేయడమే కాదు ఎంజాయ్ చెయ్యడానికి పక్కాప్లాన్ చేస్తున్నాడు. చోరీ చేసిన నగదు, నగలు విక్రయించి అందులో వచ్చిన డబ్బుతో పబ్ లో యువతులతో సరదాగా గడుపుతున్నాడు. అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళలతో బయట ఎంజాయ్ చేస్తున్న యువకుడిని బెంగళూరు పోలీసులు పట్టుకున్నారు.

బెంగళూరు నగరంలోని

మైకోలేఅవుట్‌ స్టేషన్‌ పోలీసుల వద్ద ఇన్ ఫార్మర్ గా ఉంటూ భార్య సహాయంతో నిందితుడు చేతివాటం చూపిస్తున్నాడు. భార్య ఇచ్చిన సమాచారంతో నిందితుడు సునీల్ పక్కాప్లాన్ ప్రకారం లక్షాలాది రూపాయల బంగారు నగలు లూటీ చేసి వాటిని తక్కువ ధరకు విక్రయిస్తున్నాడు. నిందితుడు సునీల్ ను విచారించగా అతడు చేస్తున్న పనులు చూసి బెంగళూరు పోలీసులు అవాక్కయ్యారు.

A young man who steals and enjoys with girls in Bengaluru pubs

ఈ సమయంలో ఒకటి కాదు రెండు కాదు పదకొండు కేసుల్లో నిందితుడు సునీల్ వాంటెడ్ అని తెలుసుకున్న పోలీసులు షాక్ అయ్యారు. నిందితుడు సునీల్ అరెస్టుతో పదకొండు కేసులు ఓ కొలిక్కి వచ్చాయని బెంగళూరు పోలీసు అధికారులు తెలిపారు. బెంగళూరు సిటీలోని మైకోలేఅవుట్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే చోరీకి సంబంధించిన 11 కేసుల్లో నిందితుడు సునీల్ నిందితుడు అని, ఈ కేసులన్నింటిలో ప్రధాన నిందితులు. భార్యాభర్తలిద్దరూ అని పోలీసులు తెలిపారు.

సునీల్ అతని భార్య ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నామని చుట్టుపక్కల వాళ్లను నమ్మించారు. పనికి వెళ్లే ముసుగులో ఇద్దరూ ఉదయం ఇంటి నుంచి బయటకు వెలుతున్నారు. తరువాత ఇళ్లకు తాళం వేసిన విషయం గుర్తించిన భార్య ఆమె భర్త సునీల్ కు సమాచారం ఇస్తోంది. ఇళ్లకు తాళం వేసిన ఇండ్లు టార్గెట్ చేసిన నిందితుడు చుట్టుపక్కల ఎవరైనా గమనిస్తున్నారా అని క్షుణ్ణంగా ఆరా తీస్తున్నాడు. తరువాత సునీల్ తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని ఇంటి తలుపులు పగులగొట్టి బంగారు ఆభరణాలు దోచుకుంటున్నాడు.

దొంగిలించిన బంగారు ఆభరణాలను విక్రయిస్తున్న సునీల్ ఆ డబ్బుతో పబ్‌ల్లో యువతులతో సరదాగా గడిపేవాడని, దొంగిలించిన బంగారు ఆభరణాల్లో కొన్నింటిని అక్రమ సంబంధం పెట్టుకున్న గర్ల్ ఫ్రెండ్స్, ఆంటీలకు ఇచ్చి వాళ్లతో శారీరక సుఖం అనుభవిస్తున్నాడని పోలీసులు తెలిపారు. కొందరు పోలీసులతో లింక్ పెట్టుకున్న సునీల్ పోలీసు ఇన్ ఫార్మర్ గా కొంతకాలం పని చేశాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళలతో సునీల్ పిచ్చపాటిగా ఎంజాయ్ చేశాడని పోలీసులు తెలిపారు. చోరీ చేసిన డబ్బుతో సునీల్ పబ్ ల్లో విలాసవంతమైన జీవితం గడిపేవాడని పోలీసులు తెలిపారు.

A young man who steals and enjoys with girls in Bengaluru pubs

ప్రస్తుతం నిందితుడి నుంచి 520 గ్రాములు (అర్ద కేజీ బంగారు) బంగారు ఆభరణాలు, అర కేజీ వెండి స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. నిందితుడు సునీల్‌ కోవిడ్‌ (కరోనా వైరస్) మొదలైన కాలం నుంచి దొంగతనాలు చెయ్యడం నేర్చుకుని తరువాత ఉద్యోగం చెయ్యడం మానేశాడని, భార్యతో కలిసి ఫుల్ టైమ్ దొంగతనాలు చెయ్యడానికి టూల్‌ కిట్‌ పెట్టుకుని బెంగళూరు నగరంలో బంగారు నగలు, వెండి వస్తువులు దొంగతనాలు చేసి విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో తెలిసింది.

చోరీ చేసిన మరుసటి రోజు ఏమీ తెలియకుండా పోలీసుల వెంట తిరుగుతూ వారికి సమాచారం ఇచ్చేవాడిలాగా నటించాడని, పోలీసుల చుట్టూ తిరుగుతున్నాడని పోలీసు అధికారులు తెలిపారు. ఇటీవల నిందితుడు సునీల్ ఓ మొబైల్ ఫోన్‌ను దొంగిలించాడు. చోరీ చేసిన మొబైల్ ఫోన్ లో కొత్త సిమ్‌ను పెట్టిన సునీల్ ఆ మొబైల్ ఫోన్ వాడుతున్న సమయంలో పోలీసులకు అడ్డంగా చిక్కిపోయాడని పోలీసు అధికారులు తెలిపారు. నిందితుడు సునీల్ పై మైకో లేఅవుట్ పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదైనాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+