బెంగళూరులో 99 సార్లు ట్రాఫిక్స్ రూల్స్ బ్రేక్ చేసిన యువకుడు, ఎలా చిక్కాడో తెలుసా !
బెంగళూరు: ఐటీ హబ్, సిలికాన్ సిటీగా పేరుపొందిన బెంగళూరు (bengaluru) నగరంలో లక్షల సంఖ్యలో కార్లు (car), బైక్ లు తిరుగుతున్నాయి. బెంగళూరు (bengaluru)నగరంలో నివాసం ఉండే ప్రజల తిరిగే వాహనాలతో పాటు కర్ణాటకలోని ఇతర ప్రాంతాలు, ఇతర రాష్ట్రాల నుంచి ప్రతిరోజు వేల సంఖ్యలో బెంగళూరు నగరంలోని కార్లు, బైక్ లతో పాటు ఇతర వాహనాలు వచ్చి వెలుతున్నాయి.
బెంగళూరు (bengaluru)నగరంలో ట్రాఫిక్ ( traffic) నియమాలు ఉల్లంఘించి సంచరించే వాళ్ల సంఖ్య ఎక్కువగానే ఉంది. వేలాది మంది ట్రాఫిక్ ( traffic) పోలీసులు నిత్యం బెంగళూరులో విధులు నిర్వహిస్తు ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించే వారికి అపరాదరుసుం విధించి ఫైన్లు వసూలు చేస్తున్నారు. అయినా బెంగళూరు (bengaluru) నగరంలో నిత్యం ట్రాఫిక్ ( traffic) నియమాలు ఉల్లంఘించి తిరిగే వారి సంఖ్య ఏమాత్రం దగ్గలేదు.

బెంగళూరు (bengaluru) నగరంలో నివాసం ఉంటున్నహసన్ అనే వ్యక్తి నిత్యం ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించి బైక్ లో (bike) తిరుగుతున్నాడు. బెంగళూరు ట్రాఫిక్ ( traffic) పోలీసులు చాలాకాలం నుంచి హసన్ ను పట్టుకోవడానికి అనేక ప్రయత్నాలు చేసి విఫలం అవుతున్నారు. ఇటీవల హసన్ కు గ్రహాలు అనుకూలించలేదని తెలిసింది.
తలకు హెల్మెట్ పెట్టుకోకుండా వన్ వేలో బైక్ నడుపుతూ హసన్ దర్జాగా వెళ్లాడు. ఆ సమయంలో కారు బ్యానెట్ మీద ఏర్పాటు చేసిన కెమెరాలో హసన్ హంగామా రికార్డు అయ్యింది. తరువాత కారు యజమాని వన్ వేలో తలకు హెల్మెట్ పెట్టుకోకుండా నిర్లక్షంగా బైక్ నడిపిన హసన్ ను గుర్తించి వెంటనే కర్ణాటక డీజీపీకి (DGP) ట్విట్టర్ (X)లో పంపించారు.
ఈ విషయం సీరియస్ గా తీసుకున్న కర్ణాటక డీజీపీ వన్ వేలో హెల్మెట్ లేకుండా వేగంగా బైక్ నడిపిన హసన్ ను గుర్తించి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని బెంగళూరు (bengaluru) ట్రాఫిక్ ( traffic) పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. స్వయంగా డీజీపీ ఆదేశాలు జారీ చెయ్యడంతో బెంగళూరులోని మైకో లేఔట్ ట్రాఫిక్ ( traffic) పోలీసులు హసన్ అడ్రస్ గుర్తించి అతన్ని పట్టుకున్నారు.
ఇప్పటి వరకు హసన్ 99 సార్లు ట్రాఫిక్ ( traffic) నియమాలు ఉల్లంఘించాడని వెలుగు చూడటంతో అతని నుంచి రూ. 56 వేలు అపరాదరుసుం వసూలు చేశారు. బెంగళూరులోని (bengaluru) ఓ వ్యక్తి 99 సార్లు ట్రాఫిక్ ( traffic) నియమాలు ఉల్లంఘించారని వెలుగు చూడటం హాట్ టాపిక్ అయ్యింది. హసన్ బైక్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని తెలిసింది.












Click it and Unblock the Notifications