ఆధార్ అప్డేట్ కు ఆఖరి గడువు ఇదే.. ఇంటి నుంచే ఆధార్ అప్డేట్ ఎలాగో తెలుసా..?
కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆధార్ కార్డు గడువును మరోసారి పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది జూన్ 30 వరకు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోని వాళ్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు. ఇక ఇప్పటికే 10 ఏళ్ల క్రితం కార్డులను పొందిన వారందరూ ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవాలని యూఐడీఐ నుంచి కార్డుదారులకు సెల్ ఫోన్ కు మెసేజ్ లు వస్తున్నాయి. దీంతో ప్రజలు మీసేవా, ఇంటర్నెట్ సెంటర్ల చుట్టూ క్యూలు కడుతున్నారు. ఈ క్రమంలో కేంద్రం మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది.
ఆధార్ కార్డు ప్రతి భారతీయుడికి తప్పనిసరి. అయితే అనేక కారణాల వల్ల ఆధార్ కార్డులు అప్డేట్ చేసుకోలేక పోయినవారికి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆధార్ కార్డు అప్డేట్ ను వచ్చే ఏడాది జూన్ 30 వరకు పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అంతేకాక ఆధార్ అప్డేట్ కు మీసేవా..లేదా ఇతర ఇంటర్నెట్ సెంటర్ల చుట్టూ తిరగకుండా ఇంట్లోనే ఆధార్ కార్డు అప్డేట్ చేసుకునే విధానాన్ని కల్పించనుంది కేంద్ర ప్రభుత్వం.
కేంద్రం త్వరలో తీసుకురానున్న విధానంతో ఇకపై ఆధార్ అప్డేట్ కోసం ఆధార్ సెంటర్ లకు వెళ్లాల్సిన అవసరం లేదు. క్యూఆర్ కోడ్ ఆధారిత యాప్ సాయంతో ఆధార్ వివరాలు షేర్ చేయవచ్చు. బయోమెట్రిక్ కోసం మాత్రమే ఆధార్ కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది. నకిలీ పత్రాలతో ఆధార్ పొందే అవకాశాలను పూర్తిగా నిర్మూలించి, వ్యక్తిగత గోప్యతను కాపాడేందుకు ఈ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకురానుంది. ఈ ఏడాది చివరి నాటికి ఇంటి నుంచే ఆధార్ కార్డు అప్లై చేసుకునే విధానాన్ని తీసుకురానుంది.

ఇక ఆధార్ కార్డు అప్డేట్ చేసుకునేందుకు కొన్ని సర్టిఫికెట్స్ అవసరం అవుతాయి. అవి బర్త్ సర్టిఫికెట్, టెన్త్ క్లాస్ మార్కుల షీట్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్ పోర్ట్, PAN, PDS, MNREGA వంటి కార్డులు అవసరం. వీటి నుంచి వివరాలు తీసుకుంటుంది ఆధార్ బోర్డు. ఈ విధానం ద్వారా ప్రజలు ఆధార్ కార్డును సులభంగా అప్డేట్ చేసుకోవచ్చు. దీని ద్వారా నకిలీ డాక్యుమెంట్లతో ఆధార్ పొందే అవకాశం ఉండదు.
-
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
బాలయ్య సినిమాలో బోల్డ్ బ్యూటీ..!












Click it and Unblock the Notifications