Delhi Assembly Election 2025: ఆప్ మేనిఫెస్టో రిలీజ్.. 15 గ్యారంటీలు

దిల్లీలో ముచ్చటగా మూడోసారి అధికారాన్ని దక్కించుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా శ్రమిస్తోంది. ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఇవాళ మేనిఫెస్టోను విడుదల చేశారు. 15 గ్యారంటీలతో ఈ మేనిఫెస్టోను రూపొందించింది ఆప్.

మేనిఫెస్టోలో ఏముంది..?

ఆప్ సర్కార్ రూపొందించిన మేనిఫెస్టోలో భాగంగా యువతకు ఉద్యోగావకాశాల కల్పన మొదటి గ్యారంటీగా పేర్కొంది. రాష్ట్రంలో అర్హులైన ప్రతి విద్యార్థికి ఉపాధి, ఉద్యోగావకాశాలు అందిస్తామని మేనిఫెస్టోలో ఉంది. రెండో గ్యారంటీగా.. మహిళా సమ్మాన్ యోజన ఉంది. ఈ పథకం కింద మూడోసారి కూడా ప్రతి మహిళకు నెలకు రూ. 2,100 చెల్లిస్తామని హామీ ఇచ్చింది ఆప్ సర్కార్.

Aam Aadmi Party Unveils 15 Guarantees in Delhi Election Manifesto

మూడో గ్యారంటీ.. సంజీవిని యోజన పథకం కింద వృద్ధులకు ఉచితంగా వైద్య చికిత్స అందించనున్నారు. నాలుగో గ్యారంటీలో భాగంగా పెంచిన నీటి బిల్లులను మాఫీ చేయనున్నారు. ఐదో గ్యారంటీ కింద 24/7 స్వచ్ఛమైన తాగునీటిని సరఫరా చేస్తామని చెప్పారు. అంతేకాక యమునా నదిని శుభ్రం చేస్తామని ఆప్.. తన మేనిఫెస్టోలో పొందుపరిచింది. దిల్లీలోని రోడ్లను వరల్డ్ క్లాస్ విధంగా తీర్చుదిద్దుతామన్నారు.

బాబాసాహెబ్ అంబేద్కర్ స్కాలర్ షిప్ యోజన కింద విదేశాల్లో చదవాలనుకునే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు స్కాలర్ షిప్స్ అందించనున్నారు. అంతేకాక బాయ్స్ కు కూడా ఫ్రీ బస్ సదుపాయం, మెట్రో ఛార్జీల్లో 50శాతం తగ్గింపు గ్యారంటీలు అందించనుంది. పురోహితులు, గురుద్వారా గ్రంథిలకు ప్రతినెలా 18వేలు సాయం చేయనుంది. దీంతోపాటు అద్దె భవనాల్లో ఉండే ప్రజలకు కూడా విద్యుత్ బిల్లులు, నీటి బిల్లులను మాఫీ చేయనుంది. దిల్లీలోని పారిశుద్ధ్య వ్యవస్థనూ ప్రక్షాళన చేయనుంది ఆప్. కొత్త రేషన్ కార్డులు జారీ, బలహీన వర్గాల్లోని మహిళలకు వివాహ సమయంలో రూ. లక్ష, రూ. 10లక్షలతో ఇన్సురెన్స్ కవరేజీ సదుపాయాలను ఆప్ తన మేనిఫెస్టోలో వివరించింది.

ఆప్ vs బీజేపీ మేనిఫెస్టో

ఇక బీజేపీ సైతం ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు మూడు విడతల్లో మేనిఫెస్టో ప్రకటించింది. ప్రజలపై ఎన్నడూ లేనంతగా హామీల వర్షం కురిపించింది. పేద కుటుంబాలకు 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్‌, గర్భిణీలకు 21 వేల ఆర్థిక సాయం, అటల్ క్యాంటిన్లతో 5 రూపాయలకే భోజనం వంటి హామీలతో ఓటర్లను ఆకట్టుకునేందుకు యత్నిస్తోంది. ఇక దిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 5న ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలు ఫిబ్రవరి 8న వెలువడనున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+