తొలగించారా: అమీర్ ఖాన్‌కు మోడీ ప్రభుత్వం ఝలక్!
న్యూఢిల్లీ: అసహనంపై బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ కొద్ది రోజుల క్రితం చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారి తీశాయి. దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. తాజాగా, అమీర్ ఖాన్‌కు కేంద్ర పర్యాటక శాఖ ఝలక్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది!
ఇన్‌క్రెడిబుల్ ఇండియాకు అమీర్ ఖాన్ అంబాసిడర్‌గా ఉన్నాడు. కేంద్ర పర్యాటక శాఖ అతనిని తొలగించినట్లుగా వార్తలు వస్తున్నాయి.
కొద్ది రోజుల క్రితం ఓ కార్యక్రమంలో అమీర్ ఖాన్ మాట్లాడుతూ... తన భార్య కిరణ్ ఇక్కడ ఉంటున్నందుకు భయపడుతున్నట్లు చెప్పిందని, ఆమె తొలిసారి భయపడిందని, భారత్ నుంచి వెళ్లిపోదామా అని తనను అడిగిందని చెప్పాడు.

అప్పటికే దేశవ్యాప్తంగా అసహనం పైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అమీర్ ఖాన్ వ్యాఖ్యలు అసహనంకు అనుకూలంగా ఉండటంతో మెజార్టీ సభ్యులు అమీర్ ఖాన్ పైన మండిపడ్డారు. బిజెపి నేతలు అయితే ఆయన పైన దుమ్మెత్తిపోశారు.
ఆ తర్వాత తీవ్ర విమర్శలు చెలరేగిన నేపథ్యంలో అమీర్ ఖాన్ మాట్లాడుతూ... తనకు లేదా తన భార్యకు దేశం విడిచి వెళ్లిపోవాలని లేదని, అలా ఎప్పుడూ అనుకోలేదని, ఇక ముందు కూడా అనుకోమని చెప్పాడు.












Click it and Unblock the Notifications