ఉగ్ర ఘాతుకం: ఆర్మీ అధికారి కిడ్నాప్, దారుణ హత్య
శ్రీనగర్: ఉగ్రవాదులు మరోసారి దారుణానికి తెగబడ్డారు. జమ్మూకాశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో లెఫ్ట్‌నెంట్ ర్యాంక్ ఆర్మీ అధికారి ఉమర్ ఫయ్యజ్ దారుణంగా హత్య చేశారు. ఉమర్‌ను గత రాత్రి ఉగ్రవాదులు కిడ్నాప్ చేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.

కుల్గాం జిల్లాకు చెందిన ఉమర్.. మంగళవారం షోపియాన్‌లోని తమ బంధువుల ఇంట్లో పెళ్లి వేడుకలకు వెళ్లారు. కాగా, బుధవారం ఉదయం హెర్మేన్ ప్రాంతంలో ఆయన మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమందించారు.
J&K: Bullet ridden body of a Army lieutenant found in Shopian district's Herman, in South Kashmir; identified as Umar Fayaz from Kulgam pic.twitter.com/lmeOU3Kgsa
— ANI (@ANI_news) May 10, 2017
ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించగా.. తుపాకీతో కాల్చి చంపినట్లు గుర్తించారు. ఉమర్‌ను ఉగ్రవాదులు కిడ్నాప్ చేసి, హత్య చేసినట్లు పోలీసులు చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
షోపియాన్ జిల్లాలో ఉగ్రవాదుల వేట కొనసాగుతోంది. సుమారు 3వేల మంది భద్రతా దళాలు ఉగ్రవాదుల కోసం గాలింపు చేపడుతున్నాయి. 30 నుంచి 40మంది మిలిటెంట్ ఈ ప్రాంతంలో తలదాచుకున్నట్లు సమాచారం అందడంతో విస్తృతంగా ఆపరేషన్ కొనసాగిస్తున్నారు.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications