వచ్చేస్తున్నాడు: త్వరలోనే యుద్ధవిమానాలను తిరిగి నడపనున్న అభినందన్.. కండిషన్స్ అప్లై?
ఢిల్లీ: అభినందన్ వర్థమాన్... ఈ పేరు తెలియని భారతీయుడు ఉండరు. పుల్వామా దాడుల తర్వాత పాకిస్తాన్ యుద్ధ విమానాలు భారత గగనతలంలోకి వచ్చిన సమయంలో వాటిని వెంటాడుతూ వెళ్లి పాక్ సైన్యానికి పట్టుబడిన సంగతి తెలసిందే. అయితే 48 గంటల తర్వాత అభినందన్ వర్థమాన్‌ను పాక్ విడుదల చేసింది.ఇక అప్పటి నుంచి పలు వైద్యపరీక్షలకు హాజరయ్యారు. ఇక త్వరలో తిరిగి ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో చేరుతారనే వార్తలు వచ్చాయి. అయితే కొన్ని అనుమతులు ఇంకా రావాల్సి ఉండగా అభినందన్ వేచిచూడాల్సి వచ్చింది.
తాజాగా ఈ 35 ఏళ్ల వింగ్ కమాండర్ అభినందన్ త్వరలో జెట్ ఫైటర్లకు కమాడింగ్ చేస్తారని తెలుస్తోంది. అయితే ఇందుకు బెంగళూరులోని ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ ఎయిరో స్పేస్ మెడిసిన్‌లో పలు వైద్యపరీక్షలకు హాజరుకావాల్సి ఉంటుందని ఇద్దరు వాయుసేన అధికారులు తెలిపారు. పాకిస్తాన్ ఎఫ్-16 యుద్ధ విమానంను కూల్చి వర్ధమాన్ ఓ చరిత్ర సృష్టించారు. ఆ తర్వాతే తాను నడుపుతున్న మిగ్ -21 యుద్ధ విమానంను పాక్ వాయుసేన కూల్చింది. అయితే సురక్షితంగా బయటపడ్డాడు అభినందన్. అయితే పాక్ భూభాగంలో ల్యాండ్ అవడంతో అతన్ని పాక్ సైన్యం పట్టుకుంది. ఇక మిగ్ 21 బైసన్‌తో ఎఫ్-16 యుద్ధ విమానంను కూల్చడం సాధారణ విషయం కాదని తొలిసారిగా అభినందన్ కూల్చి సరికొత్త చరిత్ర సృష్టించారని భారత వాయుసేన ప్రశంసించింది. అంతేకాదు అభినందన్ పేరును వీర్ చక్ర అవార్డుకు ప్రతిపాదించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

పుల్వామా దాడులకు ప్రతీకారచర్యలో భాగంగా పాకిస్తాన్ లోని బాలాకోట్‌లో ఉగ్రవాద శిబిరాలపై భారతవాయుసేన మెరుపు దాడి చేసింది. ఆ తర్వాత పాకిస్తాన్ యుద్ధ విమానాలు భారత్‌పై దాడి చేసేందుకు భారత గగనతలంలోకి దూసుకొచ్చాయి. భారత్ పాక్‌కు జరిగిన డాగ్ ఫైట్‌లో అభినందన్ వర్థమాన్ పాక్ యుద్ధ విమానంను కూల్చేశాడు. దురదృష్టవశాత్తు ఆయన కమాండింగ్ చేస్తున్న యుద్ధ విమానం కూడా కూలిపోయింది. అయితే అంత ఎత్తునుంచి కిందకు దిగడంతో అభినందన్ పక్కటెముకలు, వెన్నెముకలకు గాయాలైనట్లు మెడికల్ టెస్టుల్లో బయటపడ్డాయి. ఇలాంటి సందర్భాల్లో పైలట్లను 12 వారాల పాటు పర్యవేక్షణలో ఉంచుతారు. అన్నీ ఓకే అనుకుంటేనే తిరిగి యుద్ధ విమానాలను నడిపే అవకాశమిస్తారు. ప్రస్తుతం అభినందన్ తన శ్రీనగర్ యూనిట్‌లో రిపోర్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. అంతకుముందు నాలుగు వారాల పాటు మెడికల్ లీవ్ పై అభినందన్ వెళ్లారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications