శత్రువు చేతికి చిక్కినా.. వెల్‌కం అభినందన్: పవన్ కళ్యాణ్, గంభీర్, సైనా నెహ్వాల్ సహా ప్రముఖులు
న్యూఢిల్లీ: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ స్వదేశానికి చేరుకున్నారు. వాఘా సరిహద్దు వద్ద అభినందన్‌ను పాక్.. భారత్‌కు అప్పగించింది. లాహోర్ నుంచి రోడ్డు మార్గంలో ఆయనను పాక్ అధికారులు తీసుకువచ్చారు. వాఘా సరిహద్దు వద్ద ఇరు దేశాలకు చెందిన అధికారులు పరస్పరం పత్రాలు మార్చుకున్న అనంతరం కమాండర్‌ను భారత అధికారులకు అప్పగించారు. ఈ సందర్భంగా సరిహద్దు వద్ద అభినందన్‌కు భారత వాయుసేన ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. ఆయన తిరిగి రావడంపై ప్రముఖులు స్పందించారు.

నీ మొక్కవోని ధైర్యం అబ్బురపరిచింది
అభినందన్ తిరిగి రావడం జనసేనాని ఆనందం వ్యక్తం చేశారు. ఆయన పుణ్యభూమికి తిరిగి రావడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని చెప్పారు. అతను సార్ధక నామధేయుడు అని, శత్రువు చేతికి చిక్కినా అతని మొక్కవోని ధైర్యం అందరినీ అబ్బురపరిచిందని చెప్పారు. నీ సాహసం, తెగువ, ఈనాటి యువతకు ఆదర్శమని, జాతి యావత్తు నీ రాక కోసం ఎదురు చూసిన ఈ తరుణంలో తన తరఫున, జనసైనికుల తరఫున శుభాభినందనలు అన్నారు.
మీరు మాకున్నందుకు మేమెంతో గర్వపడుతున్నామని, మీ ధైర్య సాహసాల ముందు మోకరిల్లుతున్నామని, స్వాగతం అభినందన్.. మిమ్మల్ని ప్రేమిస్తున్నామని, మిమ్మల్ని చూసి గర్వం పడుతున్నామని వీరేంద్ర సెహ్వాగ్ పేర్కొన్నారు.
మన హీరోకు స్వాగతం అని సైనా నెహ్వాల్, వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ సమస్త భారత దేశం మీ ధైర్య సాహసాలకు, దేశభక్తికి వందనం చేస్తోందని సురేష్ రైనా, సంక్లిష్ట పరిస్థితుల్లో మీరు చూపిన ధైర్య సాహసాల పట్ల గర్వపడుతున్నామని, మీరు తిరిగొచ్చినందుకు సంతోషిస్తున్నామని మహ్మద్ కైఫ్, తాను ఈ భూమ్మీద జీవిస్తున్న కాలంలో మీ కన్నా పెద్ద హీరోను చూడలేదని రవిచంద్రన్ అశ్విన్ పేర్కొన్నారు.

ఆయన తిరిగొచ్చే ముందు నేనెంతో ఆందోళనపడ్డానని, భరతమాత తన బిడ్డను మళ్లీ పొందినందుకు సంతోషిస్తున్నాని గౌతమ్ గంభీర్ అన్నారు. అభినందన్ తిరిగి వచ్చినందుకు సంతోషంగా ఉందని, ఆయన కుటుంబం ఏమనుకుంటుందో నేను ఊహించగలనని, ప్రతి నిమిషం జీవితకాలంగా అనిపిస్తుందని, గుండె కొన్నిసార్లు కొట్టుకోవడం మాని వేస్తుందని ప్రీతిజింతా అన్నారు.
-
పవర్ స్టార్ "OG" సీక్వెల్ షూటింగ్ షురూ.. టైటిల్ ఇదే ?? -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications