విజయ్ తొలి అడుగే ప్రభంజనం: రెండు కోట్ల సభ్యత్వం: పార్టీ పెట్టే కారణం వెల్లడి

Thalapathy Vijay: ప్రముఖ తమిళ నటుడు విజయ్ రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఇదివరకే సొంత పార్టీని ప్రకటించారు. ఆయన పొలిటికల్ ఎంట్రీపై అప్పటివరకు వచ్చిన గాసిప్స్ అన్నీ వాస్తవ రూపాన్ని దాల్చాయి. విజయ్ పెట్టే పార్టీ ఎలా ఉండొచ్చు? దాని పేరేంటీ?..అనే ప్రశ్నలకు తెరపడిందప్పట్లో.

తాజాగా- తమిళగ వెట్రి కజగం పార్టీ జెండా, ఎన్నికల గుర్తును విజయ్ ఆవిష్కరించారు. చెన్నై పనైయ్యూర్‌లో గల పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ పతాకాన్ని ఎగురవేశారు. తల్లదండ్రులు ఎస్ ఏ చంద్రశేఖర్, శోభా చంద్రశేఖర్ సమక్షంలో 30 అడుగుల ఎత్తు ఉన్న పోల్‌పై జెండాను అధికారికంగా ఆవిష్కరించారు విజయ్.

Actor and TVK chief Vijay unveils the party s flag

ఎరుపు, పసుపు రంగులతో ఈ జెండాను రూపొందించారు. జెండా మధ్యన వికసించే పువ్వు చిత్రాన్ని పసుపు, పింక్ రంగుల్లో చిత్రీకరించారు. దానికి అటు ఇటు రెండు ఏనుగుల ఫొటోలను అమర్చారు. ఈ యుద్ధ ఏనుగులను.. శౌర్య పరాక్రమాలకు ప్రతీకగా, విజయ కేతనానికి సంకేతంగా ముద్రించారు.

అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్లతో కలిసి ప్రతిజ్ఞ చేశారు. స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను అర్పించిన వారిని స్మరించుకున్నారు. వారికి నివాళి అర్పించారు. తమిళనాడుకు చెందిన స్వాతంత్ర్య సమరయోధులను అమర సైనికులుగా అభివర్ణించారు. వారి త్యాగాలను ఎల్లప్పుడూ గౌరవిస్తానని, వారి సిద్ధాంతాల అనుగుణంగా పార్టీ పని చేస్తుందని చెప్పారు.

రాష్ట్ర ప్రయోజనాలు, తమిళ భాష, భారత రాజ్యాంగం, సార్వభౌమాధికారంపై విశ్వాసం, దేశ సమైక్యత, సోదరభావాన్ని కాపాడుకోవడానికి నిరంతరం కృషి చేస్తానని విజయ్ ప్రతిజ్ఞ చేశారు. మత సామరస్యాన్ని, సమానత్వాన్ని కాపాడేందుకు బాధ్యతాయుతమైన వ్యక్తిగా వ్యవహరిస్తానని అన్నారు.

ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సామాజిక న్యాయాన్ని కల్పించే మార్గంలో ప్రయాణిస్తానని, ప్రజా సేవకుడిగా తన కర్తవ్యాన్ని ఎల్లవేళలా నిర్వహిస్తానని వాగ్దానం చేస్తున్నానని విజయ్ అన్నారు. కులం, మతం, లింగం, జన్మస్థలం పేరుతో వ్యత్యాసాలను రూపుమాపడం, ప్రజల్లో అవగాహన కల్పించడంతోపాటు అందరికీ సమాన అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పారు. దీనికోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సకల జీవరాశులకు సమానత్వం అనే సూత్రాన్ని తాను సమర్థిస్తానని పేర్కొన్నారు.

విజయ్ తొలి అడుగే ప్రభంజనం సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. ఏకంగా రెండు కోట్ల మందిని పార్టీలో చేర్చుకోవాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇప్పటికే సగం పని పూర్తయినట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా భారీ స్థాయిలో సభ్యత్వ నమోదు కార్యక్రమాలను ఇదివరకే చేపట్టింది టీవీకే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+