రజనీ రాజకీయాల్లోకి రారు, కమల్ వచ్చినా సీఎం కాలేడు: సొంత సోదరుడు చారుహాసన్ ఝలక్ !

రజనీకాంత్ కచ్చితంగా రాజకీయాల్లోకి రారుకమల్ హాసన్ రాజకీయాల్లోకి వచ్చిన సీఎం మాత్రం కాలేరుకమల్ కు వ్యతిరేంగా వ్యాఖ్యలు చేసిన ఆయన సొంత సోదరుడు, సుహాసిని తండ్రి చారుహాసన్

చెన్నై: సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్ రాజకీయాల్లోకి రావాలని ప్రయత్నిస్తున్న సమయంలో కమల్ సోదరుడు, బహుబాష నటి సుహాసిని తండ్రి చారుహాసన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కమల్ హాసన్ రాజకీయాల్లోకి వచ్చినా కచ్చితంగా తమిళనాడు సీఎం కాలేరని అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఓ ప్రైవేట్ టీవీ చానల్ కు కమల్ హాసన్ సోదరుడు, బహుబాష నటుడు చారుహాసన్ ఇంటర్వూ ఇచ్చారు. చారుహాసన్ ఇచ్చిన ఇంటర్వూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. రజనీకాంత్ రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదని, ఆయన సినీ రంగానికే పరిమితం అవుతారని చారుహాసన్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

Actor Charu Haasan Negative comment on his brother kamal Haasan politics.

కమల్ హాసన్ రాజకీయాల్లోకి వచ్చినా ఆయన కచ్చితంగా తమిళనాడు ముఖ్యమంత్రి కాలేడని, ఇప్పటికే రాజకీయాల్లో ఆరితేరిన చాల మంది ఆ స్థానంలో కుర్చోవాలని ప్రయత్నిస్తున్నారని కమల్ హాసన్ కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. రజనీకాంత్ మాత్రం రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదని చారుహాసన్ కచ్చితంగా చెప్పారు.

తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఎవ్వరికి ఉంది అని ఆ టీవీ చానల్ ప్రతినిధి ప్రశ్నిస్తే పీఎంకే పార్టీ అధ్యక్షుడు, కేంద్ర మాజీ మంత్రి అన్బుమణి రామదాస్ కు సీఎం అయ్యే అర్హత ఉందని కమల్ హాసన్ సోదరుడు చారుహాసన్ సమాధానం ఇచ్చారు.

Actor Charu Haasan Negative comment on his brother kamal Haasan politics.

నవంబర్ 7వ తేది తన పార్టీ పేరు, జెండా గుర్తు ప్రకటిస్తానని కమల్ హాసన్ ఇప్పటికే చెప్పారు. కమల్ హాసన్ సొంత సోదరుడు చారుహాసన్ స్వయంగా కమల్ కు వ్యతిరేకంగా మాట్లాడటంతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంపై కమల్ హాసన్ ఇంకా స్పంధించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+