నటి కిడ్నాప్, లైంగిక దాడి కేసు: సీబీఐతో విచారణ చేయించాలి: హీరో దిలీప్, కేంద్రానికి లేఖ !

Posted By:
Subscribe to Oneindia Telugu

తిరువనంతపురం: ప్రముఖ బహుబాష నటి కిడ్నాప్, సామూహిక లైంగిక దాడి కేసును సీబీఐకి అప్పగించాలని ఆకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాలీవుడ్ హీరో దిలీప్ డిమాండ్ చేస్తున్నారు. నటి కిడ్నాప్, లైంగిక దాడి కేసులో వాస్తవాలు వెలుగు చూడాలంటే సీబీఐతో దర్యాప్తు చేయించాలని దిలీప్ అంటున్నాడు.

నటి కిడ్నాప్, లైంగిక దాడి కేసును సీబీఐతో విచారణ చేయించాలని హీరో దిలీప్ కేంద్ర హోం శాఖ కార్యదర్శికి లేఖ రాశారు. రెండు వారాల క్రితమే మాలీవుడ్ హీరో దిలీప్ 12 పేజీల లేఖను కేంద్ర హోం శాఖ కార్యదర్శికి పంపించారని శుక్రవారం వెలుగు చూసింది.

actor Dileep has sought CBI inquiry into actress molestation and abduction case.

లేఖలో నివరాలు ఈ విధంగా ఉన్నాయి. నటి కిడ్నాప్, లైంగిక దాడి కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని దిలీప్ వివరించాడు. కేరళ డీజీపీ లోక్ నాథ్ బెహరా, ఏడీజీపీ సంధ్యా, ఎర్నాకుళం గ్రామీణ జిల్లా ఎస్పీ జార్జ్ కలిసి తనను ఈ కేసులో ముద్దయిని చేసి అరెస్టు చేశారని ఆరోపించారు.

నటి కిడ్నాప్, లైంగిక దాడి కేసు విచారణ నుంచి డీజీపీ లోక్ నాథ్ బెహరా, ఏడీజీపీ సంధ్యా, ఎర్నాకుళం గ్రామీణ జిల్లా ఎస్పీ జార్జ్ ను తప్పించాలని డిమాండ్ చేశారు. నటి కిడ్నాప్, లైంగిక దాడి కేసులో ప్రముఖ ముద్దాయి పల్సర్ సునీ తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని ఫిర్యాదు చేసినా పోలీసు అధికారులు పట్టించుకోలేదని దిలీప్ ఆరోపిస్తున్నాడు.

2017 ఫిబ్రవరి 17వ తేదీన రాత్రి షూటింగ్ ముగించుకుని ఇంటికి వెలుతున్న ప్రముఖ నటిని పల్సర్ సునీ తదితరులు కిడ్నాప్ చేసి సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ కేసులో జులై 11వ తేదీన కేరళ పోలీసులు హీరో దిలీప్ ను అరెస్టు చేసి జైలుకు పంపించారు. నాలుగు సార్లు బెయిల్ నిరాకరించిన న్యాయస్థానం చివరికి అక్టోబర్ 3వ తేదీన హీరో దిలీప్ కు బెయిల్ మంజూరు చెయ్యడంతో అతను బయటకు వచ్చి సీబీఐతో విచారణ చేయించాలని అంటున్నాడు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Malayalam actor Dileep has sought CBI inquiry into Malayalam actress molestation and abduction case.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి