Actor: బైక్ లో వెళ్లి ఇంటి ముందే నటుడి మీద రివాల్వర్ తో ఢిష్యూం ఢిష్యూం, రియల్ గా తప్పించుకున్న హీరో !
బెంగళూరు/ బెళగావి: ప్రముఖ నటుడు ఖాళీగా ఉన్న సమయంలో సొంతఊరిలో ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఇంట్లో ఉన్న నటుడు ఇంటి బయటకు వచ్చి నిలబడి ఫోన్ లో మాట్లాడుతున్నాడు. ఆ సమయంలో బైక్ లో వెళ్లిన వ్యక్తి హీరోను చూసి హాయ్ అంటూ పలకరించి రివాల్వర్ తీసుకుని అతని మీద కాల్పులు జరిపాడు. మూడు బుల్లెట్లు దూసుకుపోయాయి. అయితే సినిమాల్లో హీరోలు రివాల్వర్ బుల్లెట్ల నుంచి తప్పించుకున్నట్లు అతను కూడా తప్పించుకోవడంతో ఆ నటుడు ప్రాణాలతో భయటపడ్డాడు.

ఒక్కసినిమాతో అగ్రహీరోలా జాబితాలో చేరిపోయాడు
స్యాండిల్ వుడ్ నటుడు శివరంజన్ ఓ కాలంలో ఓ మంచి నటుడిగా, హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. రాజారాణి, అమృతసింధు తదితర సినిమాల్లో శివరంజన్ హీరోగా నటించాడు. అమృతసింధు సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో స్యాండిల్ వుడ్ లో శివరంజన్ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

సొంత ఊరిలో నటుడు
ప్రముఖ నటి శృతి, శివరంజన్ కలిసి అమృతసింధు సినిమాలో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. శివరంజన్ సొంత ఊరు బెళగావి జిల్లాలోని బైళహొంగల (మహారాష్ట్ర సరిహద్దు జిల్లా)లో ఉంది. ఖాళీగా ఉన్న సమయంలో శివరంజన్ ఆయన సొంతఊరిలోని బైళహోంగలలో ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్నాడు.

బైక్ లో వెళ్లి రివాల్వర్ తో కాల్పులు
ఇంట్లో ఉన్న నటుడు శివరంజన్ ఇంటి బయటకు వచ్చి నిలబడి ఫోన్ లో మాట్లాడుతున్నాడు. ఆ సమయంలో బైక్ లో వెళ్లిన వ్యక్తి రివాల్వర్ తీసుకుని శిరంజన్ మీద కాల్పులు జరిపాడు. నటుడు శివరంజన్ మీద మూడు రౌండ్లు కాల్పులు జరిపిన నిందితుడు అక్కడి నుంచి బైక్ లో పారిపోయాడు.

సినిమా ఫక్కీలో తప్పించుకున్న నటుడు
అయితే సినిమా ఫక్కీలో మూడు రౌండ్ల కాల్పులు జరిపినా శివరంజన్ తప్పించుకోవడంతో అతను ప్రాణాలతో భయటపడ్డాడు. విషయం తెలుసుకున్న బెళగావి జిల్లా ఎస్పీ డాక్టర్ సంజీవ్ పాటిల్, డీఎస్సీ శివనాంద కటగి, సీఐ సాకతేనహళ్లి సంఘటనా స్థలానికి చేరుకుని నటుడు శివరంజన్ నుంచి వివరాలు తెలుసుకున్నారు. నటుడు శివరంజన్ మీద రివాల్వర్ తో కాల్పులు జరపడం ఆ ప్రాంతంలో కలకలం రేపింది.
-
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా












Click it and Unblock the Notifications