Actor: నటుడికి సినిమా చూపించిన క్రెడిట్ కార్డు రికవరీ సిబ్బంది, అపార్ట్ మెంట్ లో హంగామా, తల్లి, వదినతో !
బెంగళూరు: సినిమాలు, టీవీ సీరియల్స్ లో నటిస్తున్న యువకుడు నటుడిగా మంచి పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆ నటుడు కొన్ని సంవత్సరాల నుంచి ఓ బ్యాంకు క్రెడిట్ కార్డు ఉపయోగిస్తున్నాడు. ప్రతినెల సరైన టైమ్ కు క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించేవాడు. కరోనా వైరస్ దెబ్బతో సినీరంగం కూడా ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో కరోనా వైరస్ దెబ్బతో సినిమా, టీవీ సీరియల్స్ షూటింగ్స్ నిలిచిపోవడంతో ఆ నటుడు రూ. 2 లక్షల క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించలేకపోయాడు. క్రెడిట్ కార్డు రికవరీ సిబ్బంది బిల్లు వెంటనే చెల్లించాలని ఆ నటుడిని టార్చర్ పెట్టారు. తనకు కొంచెం సమయం కావాలని, పూర్తి డబ్బులు చెల్లిస్తానని ఆ నటుడు బ్యాంకు అధికారులకు మనవి చేశాడు. బ్యాంకు అధికారులు ఓకే చెప్పి ఆ నటుడికి బిల్లు చెల్లించడానికి సమయం ఇచ్చినా క్రెడిట్ కార్డు రికవరీ సిబ్బంది ఓవర్ యాక్షన్ చేశారని ఆరోపణలు ఉన్నాయి. నటుడు ఇంట్లో లేని సమయంలో అతని అపార్ట్ మెంట్ లోకి వెళ్లిన క్రెడిట్ కార్డు రికవరీ టీమ్ అతని తల్లి, వదినను చంపేస్తామని బెదిరించారని ఆ నటుడు ఐటీ హబ్ లో కేసు పెట్టడం హాట్ టాపిక్ అయ్యింది.

సినిమా నటుడు
బెంగళూరులోని సుబ్రమణ్యపురలోని ఓ అపార్ట్ మెంట్ లో శుభం శర్మా అలియాస్ శుభం అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. సినిమాలు, టీవీ సీరియల్స్ లో నటిస్తున్న శుభం శర్మా నటుడిగా మంచి పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటికే అనేక కన్నడ సినిమాలు, టీవీ సిరియల్స్ లో నటించిన శుభం శర్మా సినీ రంగంలో గుర్తింపు తెచ్చుకున్నాడు.

క్రెడిట్ కార్డు తీసుకున్న నటుడు
కొన్ని సంవత్సరాల క్రితం నటుడు శుభం శర్మా కొటక్ బ్యాంక్ క్రెడిట్ కార్డు తీసుకున్నాడు. కొన్ని సంవత్సరాల నుంచి కొటక్ బ్యాంకు క్రెడిట్ కార్డు ఉపయోగిస్తున్నాడు. నటుడు శుభం శర్మా ప్రతినెల సరైన టైమ్ కు క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించేవాడు. కరోనా వైరస్ దెబ్బతో సినీరంగం కూడా ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో కరోనా వైరస్ దెబ్బతో సినిమా, టీవీ సీరియల్స్ షూటింగ్స్ నిలిచిపోవడంతో నటుడు శుభం శర్మా రూ. 2 లక్షల క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించలేకపోయాడు.

క్రెడిట్ కార్డు రికవరీ టీమ్ ఎంట్రీ
క్రెడిట్ కార్డు రికవరీ సిబ్బందిలో ఒకడైన కిరణ్ హల్లూర్ అలియాస్ కిరణ్ అనే వ్యక్తి నటుడు శుభం శర్మాకు ఫోన్ చేసి క్రెడిట్ కార్డు బిల్లు వెంటనే చెల్లించాలని ఆ నటుడిని టార్చర్ పెట్టాడు. కిరణ్ టార్చర్ ఎక్కువ కావడంతో నటుడు శుభం శర్మా బ్యాంకు అధికారులను సంప్రధించాడు. తనకు కొంచెం సమయం కావాలని, పూర్తి డబ్బులు చెల్లిస్తానని నటుడు శుభం శర్మా కొటక్ బ్యాంకు అధికారులకు మనవి చేశాడు.
Recommended Video


బ్యాంక్ ఒకే చెప్పినా..... కిరణ్ ఓవర్ యాక్షన్
బ్యాంకు అధికారులు శుభం శర్మా లేటుగా బిల్లులు చెల్లించడానికి ఓకే చెప్పారని తెలిసింది. అయితే నటుడు శుభం శర్మాకు బిల్లు చెల్లించడానికి బ్యాంకు అధికారులు సమయం ఇచ్చినా క్రెడిట్ కార్డు రికవరీ టీమ్ లీడర్ కిరణ్ మాత్రం ఓవర్ యాక్షన్ చేశాడని ఆ నటుడు ఆరోపిస్తున్నాడు. నువ్వు ఎక్కడ ఉన్నావ్ చెప్పు, నేను వస్తున్నాను, క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించే వరకు నిన్ను వదిలపెట్టను అంటూ కిరణ్ నటుడు శుభం శర్మాను టార్చర్ పెట్టాడని ఆరోపణలు ఉన్నాయి.

ఆర్ బీఐని ఆశ్రయించిన నటుడు
క్రెడిట్ కార్డు టీమ్ లీడర్ కిరణ్ టార్చర్ తట్టుకోలేక నటుడు శుభం శర్మా ఆర్ బీఐ అధికారులను ఆశ్రయించాడు. మీరు ఇళ్ల దగ్గరకు వెళ్లి బాధితులను ఇబ్బంది పెట్టకూడదని, చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఆర్ బీఐ అధికారులు క్రెడిట్ కార్డు రికవరీ సిబ్బందికి నోటీసులు ఇచ్చినా కూడా కిరణ్ మాత్రం కొంచెం కూడా వెనక్కి తగ్గలేదని తెలిసింది.

అపార్ట్ మెంట్ లో హంగామా
నటుడు శభం ఇంట్లో లేని సమయంలో అతని అపార్ట్ మెంట్ లోకి వెళ్లిన క్రెడిట్ కార్డు రికవరీ టీమ్ లీడర్ కిరణ్ అక్కడ హంగామా చేసి నటుడు తల్లి, వదినను చంపేస్తామని బెదిరించాడని ఆరోపణలు ఉన్నాయి. కిరణ్ టార్చర్ తట్టుకోలేక నటుడు శుభం శర్మా బెంగళూరులోని సుబ్రమణ్యపుర పోలీస్ స్టేషన్ లో క్రెడిట్ కార్డు రికవరీ టీమ్ కు చెందిన కిరణ్ హల్లూరి మీద కేసు పెట్టడం హాట్ టాపిక్ అయ్యింది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications