Actor: సినిమాల్లో విలన్, నిజజీవితంలో రేప్ కేసులో సార్ అరెస్టు, ఇప్పటికే ఖల్ నాయక్ మీద చీటింగ్ కేసు !
బెంగళూరు: సినిమాల మీద మోజులో ఉద్యోగానికి రామ్ రామ్ చెప్పిన వ్యక్తి చివరికి సినిమా నటుడు అయ్యాడు. సినిమాల్లో విలన్ పాత్రలు చేస్తూ ఇప్పుడిప్పుడుడే గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. ఇప్పటికే ఈ సినిమా విలన్ మీద ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి మోసం చేశాడని చీటింగ్ కేసులు నమోదు అయ్యాయి. తన మీద అత్యాచారం చేశాడని ఓ యువతి కేసు పెట్టింది. యువతి మీద అత్యాచారం జరిగిందని ఆరోపణలు రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. యువతి తన మీద కేసు పెట్టిందని తెలుసుకున్న సినిమా నటుడు పోలీసులు అరెస్టు చేస్తారనే భయంతో ఎస్కేప్ అయ్యాడు. సినిమాల్లో విలన్ గా నటిస్తున్న ఆ నటుడు నిజజీవితంలో ఖల్ నాయక్ కావడంతో అతన్ని అరెస్టు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు.

బ్యాంకు ఉద్యోగం వదిలేసి సినిమాల్లోకి ఎంట్రి
ఐటీ హబ్ బెంగళూరులో శేషగిరి బసవరాజ్ అలియాస్ శేషగిరి అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇంతకు ముందు శేషగిరి బసవరాజ్ ఓ బ్యాంకులో ఉద్యోగం చేసేవాడు. సినిమాల మీద మోజులో బ్యాంకు ఉద్యోగానికి రామ్ రామ్ చెప్పిన శేషగిరి బసవరాజ్ చివరికి స్యాండిల్ వుడ్ సినిమాల్లో (కన్నడ సినిమాలు) చాన్స్ దక్కించుకుని నటుడు అయ్యాడు.

సినిమాల్లో విలన్ గా నటిస్తున్నాడు
స్యాండిల్ లో ఎంట్రీ ఇచ్చిన తరువాత శేషగిరి బసవరాజ్ కు కొన్ని మంచి అవకాశాలే వచ్చాయని చెప్పవచ్చు. కన్నడలో హిట్ అయిన డార్క్, కిలాడీలు, ఆషికి-3, సస్పెన్స్ తదితర సినిమాల్లో నటించాడు. నటుడిగా శేషగిరి బసవరాజ్ కు మంచి గుర్తింపు వస్తోంది. ప్రస్తుతం కొన్ని సినిమాల్లో శేషగిరి బసవరాజ్ నటిస్తున్నాడు.

ఉద్యోగం పేరుతో కుచ్చుటోపి
బెంగళూరులో నివాసం ఉంటున్న యువతితో నటుడు శేషగిరి బసవరాజ్ చనువుగా ఉంటున్నాడని సమాచారం. ఇదే సమయంలో ఉద్యోగం ఇప్పిస్తానని ఆమెను నమ్మించిన నటుడు శేషగిరి బసవరాజ్ ఆమె దగ్గర భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేశాడని తెలిసింది. ఇదే విషయంలో ఆ యువతి బెంగళూరులోని సుబ్రమణ్య నగర పోలీస్ స్టేషన్ లో నటుడు బసవరాజ్ మీద ఫిర్యాదు చెయ్యడంతో కొన్ని రోజుల క్రితం కేసు నమోదు అయ్యింది.

రేప్ కేసు పెట్టిన యువతి
చీటింగ్ కేసు నమోదు కావడంతో నటుడు శేషగిరి బసవరాజ్ హడలిపోయాడు. ఇదే సమయంలో తనతో అసభ్యంగా ప్రవర్తించడే కాకుండా పురుష పదజాలంతో ధూషించాడని, తనను మోసం చేసి తన మీద అత్యాచారం చేశాడని ఆ యువతి నటుడు శేషగిరి బసవరాజ్ మీద బెంగళూరులో కేసు పెట్టింది.
Recommended Video

మైసూరులో విలన్ అరెస్టు
యువతి తన మీద కేసు పెట్టిందని తెలుసుకున్న సినిమా నటుడు శేషగిరి బసవరాజ్ బెంగళూరు పోలీసులు అరెస్టు చేస్తారనే భయంతో ఎస్కేప్ అయ్యాడు. శేషగిరి బసవరాజ్ కోసం గాలించిన పోలీసులు చివరికి అతను మైసూరులో తలదాచుకున్నాడని తెలుసుకుని అక్కడ అతన్ని రెస్టు చేశారు. సినిమాల్లో విలన్ గా నటిస్తున్న శేషగిరి బసవరాజ్ నిజజీవితంలో కూడా ఖల్ నాయక్ కావడంతో అతన్ని అరెస్టు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు. నటుడు శేషగిరి బసవరాజ్ అరెస్టు కావడంతో స్యాండిల్ వుడ్ లోని కొందరు నటీనటులు హడలిపోయారని సమాచారం.












Click it and Unblock the Notifications