Actor: డ్రగ్స్ డీలర్ గా మారిన నటుడు, ఎగేసుకుని ఐటీ హబ్ లో ?, రూ. లక్షల్లో డీలింగ్ !
బెంగళూరు/కొచ్చి: బెంగళూరులో గుట్టుచప్పుడు కాకుండా డ్రగ్స్ విక్రయిస్తున్న వారి మీద పోలీసులు డేగకన్ను వేశారు. ఇప్పటికే బెంగళూరులో కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ పట్టుకుని చాలా మందిని అరెస్టు చేశారు. డ్రగ్స్ విక్రయించే వారిని పోలీసులు అరెస్టు చేస్తున్నా కొత్తగా డ్రగ్స్ డీలర్లు మాత్రం పుట్టుకు వస్తున్నారు. టీవీ సీరియల్స్ లో నటిస్తున్న ఓ నటుడితో పాటు కొందరు డ్రగ్స్ విక్రయించడానికి ప్రయత్నిస్తున్న సమయంలో బెంగళూరు పోలీసులకు అడ్డంగా బుక్కైపోయారు.

బెంగళూరు టార్గెట్ ?
బెంగళూరులో నివాసం ఉంటున్న కొందరు శ్రీమంతులు, కార్పోరేట్ కంపెనీ ఉద్యోగులు, కాలేజ్ ల్లో చదువుతున్న విద్యార్థులు, విలాసాలకు అలవాటుపడిన యువతను లక్షంగా చేసుకుంటున్న కొందరు డ్రగ్స్ డీలర్లు గుట్టుచప్పుడు కాకుండా మాదకద్రవ్యాలు విక్రయిస్తున్నారు. బెంగళూరు సిటీ పోలీసులతో పాటు సీసీబీ పోలీసులు డ్రగ్స్ డీలర్స్ మీద నిఘా వేశారు.

ఒడిశా, ఆంధ్రా, కేరళ, ముంబాయి
బెంగళూరులో గుట్టుచప్పుడు కాకుండా డ్రగ్స్ విక్రయిస్తున్న వారి మీద పోలీసులు డేగకన్ను వేశారు. ఇప్పటికే బెంగళూరులో కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ పట్టుకుని చాలా మందిని అరెస్టు చేశారు.ఇటీవల ఆంధ్రప్రదేశ్, ఒడిశా, కేరళ రాష్ట్రాల నుంచి డ్రగ్స్, గంజాయి బెంగళూరు తీసుకు వచ్చి విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేసి రూ. 5 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్ చేశారు.

టీవీ సీరియల్ నటుడి చేతివాటం
కేరళకు చెందిన మోహమ్మద్ షాహిద్, మంగల్ తోడి జితిన్, శియాజ్ అనే వ్యక్తులు బెంగళూరు చేరుకుని నివాసం ఉంటున్నారు. వీరిలో టీవీ సీరియల్స్ లో నటిస్తున్న వ్యక్తి ఉన్నాడు. నటుడితో పాటు కొందరు డ్రగ్స్ విక్రయించడానికి ప్రయత్నిస్తున్న సమయంలో బెంగళూరులోని హెచ్ఎస్ఆర్ లేఔట్ పోలీసులకు అడ్డంగా బుక్కైపోయారు.

గ్రహాలు అనుకూలించలేదు
ముగ్గురు నిందితుల నుంచి రూ. 13 లక్షల విలువై 191 గ్రాముల ఎండీఎంఏ, 2.80 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నామని హెచ్ఎస్ఆర్ లేఔట్ పోలీసులు తెలిపారు. ముగ్గురు నిందితులను విచారణ చేసి వివరాలు సేకరిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు. కేరళ నుంచి అక్రమంగా డ్రగ్స్, గంజాయి తీసుకు వచ్చి బెంగళూరులో విక్రయిస్తున్నారని పోలీసులు అంటున్నారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications