Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Actor: పార్క్ లో ప్యాంట్ విప్పేసి ఫేమస్ నటుడు ఏం చేశాడంటే ?, సీసీటీవీల్లో, ఫోక్సో కేసు, ఎందచాట, ఏంది !

కొచ్చి/ త్రిశూర్: అతను స్టార్ హీరోలతో నటించి ఇప్పటికే మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. నటుడిగా బిజీగా ఉంటున్న అతనికి పోయేకాలం వచ్చింది. పార్క్ దగ్గరకు వెళ్లిన ఫేమస్ నటుడు కారు దిగి ప్యాంట్ విప్పేశాడు. పార్క్ లో ఉన్న మైనర్ అమ్మాయిల వైపు చూసి వేకిలిచేష్టలు చేసి హస్తప్రయోగం చేశాడు. అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించిన ఆ నటుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అమ్మాయిలు కుటుంబ సభ్యులకు చెప్పడం, బాధితులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు రంగంలోకి దిగారు. పార్క్ లో, పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలు పరిశీలించిన పోలీసులు ఆ నటుడిని పట్టుకున్నారు. పార్క్ దగ్గర నేను అసభ్యంగా ప్రవర్తించిన మాట వాస్తవమే అని, అదినాకు జబ్బు అని, ఆ సందర్బంలో మద్యం సేవించడం వలన అలా చేశానని ఆ నటుడు అంగీకరించాడని పోలీసులు అన్నారు. ప్రముఖ నటుడి మీద నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద, ఫోక్స్ చట్టం కింద కేసులు నమోదు చేశారు. గతంలో కూడా ఆ నటుడు మైనర్ అమ్మాయి పట్ల ఇలాగే ప్రవర్తించడంతో అప్పుడే కేసు నమోదు అయ్యింది. ఫేమస్ నటుడు పార్క్ దగ్గర మైనర్ అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించి ఫోక్సో చట్టం కింద అరెస్టు కావడం కలకలం రేపింది. ఎందచాటా, ఏమినీకు పోయేకాలం అంటూ సాటి నటీటులు అతని మీద మండిపడుతున్నారు.

ఫేమస్ నటుడు

ఫేమస్ నటుడు

మలయాళం సినిమా రంగంలో శ్రీజిత్ రవి మంచి పేరు తెచ్చుకున్నాడు. స్టార్ హీరోలతో నటించిన శ్రీజిత్ రవి ఇప్పటికే మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. నటుడిగా బిజీగా ఉంటున్న శ్రీజిత్ రవి మలయాళ సినిమాలతో పాటు కొన్ని తమిళ సినిమాల్లో నటించాడు. చూడటానికి నల్లగా ఉన్నా మలయాళం సినిమాల్లో శ్రీజిత్ రవి బిజీ నటుల్లో ఒక్కడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

పార్క్ దగ్గర ప్యాంట్ విప్పేసి పాడుపని

పార్క్ దగ్గర ప్యాంట్ విప్పేసి పాడుపని

కేరళలోని త్రిసూర్ లోని అయంతోల్ ప్రాంతంలో ఫేమస్ ఎస్ఎన్ పార్క్ ఉంది. ఈ పార్క్ లోకి స్థానికంగా నివాసం ఉంటున్న మహిళలు, అమ్మయిలు, అబ్బాయిలు వెళ్లి వస్తుంటారు. రాత్రి పార్క్ దగ్గరకు వెళ్లిన నటుడు శ్రీజిత్ రవి పాడుపని చేశాడు. పార్క్ దగ్గరకు వెళ్లిన ఫేమస్ నటుడు శ్రీజిత్ రవి కారు దిగి ప్యాంట్ విప్పేశాడు.

మైనర్ అమ్మాయిలు

మైనర్ అమ్మాయిలు

పార్క్ లో ఉన్న 11 ఏళ్లు, 5 సంవత్సరాల వయసు ఉన్న ఇద్దరు మైనర్ అమ్మాయిల వైపు చూసిన శ్రీజిత్ రవి వేకిలిచేష్టలు చేసి హస్తప్రయోగం చేశాడు. అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించిన శ్రీజిత్ రవి అక్కడి నుంచి కారులో వెళ్లిపోయాడు. అమ్మాయిలు కుటుంబ సభ్యులకు పార్క్ లో ఇలా జరిగిందని చెప్పడంతో హడలిపోయారు.

సీసీటీవీ కెమెరాల్లో చిక్కిపోయాడు

సీసీటీవీ కెమెరాల్లో చిక్కిపోయాడు

బాధితులు సమాచారం ఇవ్వడంతో త్రిశూర్ పోలీసులు రంగంలోకి దిగారు. ఎస్ఎన్ పార్క్ లో, పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలు పరిశీలించిన పోలీసులు నటుడు శ్రీజిత్ రవి కారు నెంబర్ గుర్తించారు. వేకువజామున శ్రీజిత్ రవి ఇంటికి వెళ్లిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ చేశారు.

నాకు ఆ జబ్బు ఉందని నటుడి నాటకాలు

నాకు ఆ జబ్బు ఉందని నటుడి నాటకాలు

పార్క్ దగ్గర నేను అసభ్యంగా ప్రవర్తించిన మాట వాస్తవమే అని, అదినాకు జబ్బు అని, ఆ సందర్బంలో మద్యం సేవించడం వలన అలా చేశానని మలయాళం నటుడు శ్రీజిత్ రవి విచారణలో అంగీకరించాడని పోలీసులు అన్నారు. ప్రముఖ మలయాళం నటుడు శ్రీజిత్ రవి మీద నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద, ఫోక్సో చట్టం కింద త్రిశూర్ పోలీసులు కేసులు నమోదు చేశారు. శ్రీజిత్ రవిని కోర్టు ముందు హాజరుపరచడానికి పోలీసులు సిద్దం అయ్యారు.

2016లో కూడా ఇలాగే చేసిన శ్రీజిత్ రవి

2016లో కూడా ఇలాగే చేసిన శ్రీజిత్ రవి

మలయాళం నటుడు శ్రీజిత్ రవి మీద ఫోక్సో చట్టం కింద కేసులు నమోదు చెయ్యడం ఇది మొదటిసారికాదు. 2016లో పాఠశాలకు వెలుతున్న మైనర్ అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. కారు నిలిపిన శ్రీజిత్ రవి డ్రైవర్ సీటులో కుర్చుని అమ్మాయిలతో క్లోజ్ గా ఉంటూ అసభ్యంగా ప్రవర్తించి వారితో సెల్ఫీ ఫోటోలు దిగాడని అప్పట్లోనే ఫోక్సో చట్టం కింద కేసు నమోదు అయ్యింది.

 ఆ రోజు తప్పించుకున్నాడు

ఆ రోజు తప్పించుకున్నాడు

2016లో జరిగిన సంఘటనను అప్పట్లో శ్రీజిత్ రవి ఖండించాడు. ఆ సందర్బంలో ఆ ప్రాంతంలో సినిమా షూటింగ్ జరిగిందని, నేనే అదే ప్రాంతంలో ఉన్నా అమ్మాయిల పట్ల నేను అసభ్యంగా ప్రవర్తించలేదని తప్పించుకున్నాడు. తన కారు ఎవరో తీసుకెళ్లి ఇలా చేశారని, ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని అప్పట్లో శ్రీజిత్ రవి అన్నారు.

 ఎందచాటా, ఏమీ నీకు పోయేకాలం

ఎందచాటా, ఏమీ నీకు పోయేకాలం

ఆ సమయంలో నమోదు అయిన కేసులో, ఎఫ్ఐఆర్ లో బాధితులు శ్రీజిత్ రవి పేరు పెట్టలేదని, నల్లగా ఉన్న వ్యక్తి ఇలా చేశాడని కేసు పెట్టారని పోలీసులు అన్నారు. అయితే మరోసారి ఫోక్సో చట్టం కింద మలయాళం నటుడు శ్రీజిత్ రవి అరెస్టు కావడం కలకలం రేపింది. ఎందచాట ఏమీ నీకు పోయేకాలం అంటూ సాటి మలయాళం నటీనటులు శ్రీజిత్ రవి మీద మంపడిడుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+