నేను డిగ్రీ డిస్ కంటిన్యూ.. ! మోడీ డిగ్రీ వివాదంపై ప్రకాష్ రాజ్ సెటైర్లు..!
ప్రధాని నరేంద్ర మోడీ చదివిన డిగ్రీ వివరాలు ఇవ్వాలంటూ దాఖలైన ఓ సమాచార హక్కు పిటిషన్ పై స్పందించిన కమిషనర్ ఆ వివరాలు బయటపెట్టాలని ఢిల్లీ యూనివర్శిటీకి 2016లో ఆదేశాలు ఇచ్చారు. వీటిని సవాల్ చేస్తూ ఢిల్లీ యూనివర్శిటీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ పై సుదీర్గ విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు.. తాజాగా ప్రధాని మోడీ డిగ్రీ వివరాలు వ్యక్తిగతమని, వాటిని బయటపెట్టాల్సిన అవసరం లేదని తీర్పు చెప్పింది. దీనిపై మోడీ ప్రత్యర్థులు విరుచుకుపడుతున్నారు.
కాంగ్రెస్ తో పాటు పలువురు విపక్ష పార్టీల నేతలు, సామాజిక కార్యకర్తలు సోషల్ మీడియాలో తమ డిగ్రీల వివరాలను షేర్ చేస్తున్నారు. డిగ్రీ వివరాలు వ్యక్తిగతమన్న ఢిల్లీ హైకోర్టు తీర్పుపై స్పందిస్తూ ఇలా వారు తమ పట్టాల్ని షేర్ చేస్తున్నారు. ఇదే క్రమంలో నటుడు ప్రకాష్ రాజ్ కూడా ఇవాళ తన డిగ్రీ వివరాలను బయటపెట్టారు. అయితే ప్రకాష్ రాజ్ డిగ్రీ పూర్తి చేయలేదు. ఆయన డిగ్రీని మధ్యలోనే వదిలేసి సినీ రంగానికి వచ్చేశారు. ఇదే విషయాన్ని ఆయన బయటపెట్టారు.

పబ్లిక్ నోటీసు పేరుతో ఇవాళ ప్రకాష్ రాజ్ ఎక్స్ లో ఓ ట్వీట్ పెట్టారు. ఇందులో భారత పౌరులు, ప్రధాని మోడీ అంటూ మొదలుపెట్టారు. నేను ప్రకాష్ రాజ్.. నేను డిగ్రీ హోల్డర్ ను కాదని అందులో ఆయన వెల్లడించారు. తన సృజనాత్మక కెరీర్ ను కొనసాగించేందుకు డిగ్రీని మధ్యలోనే వదిలిపెట్టినట్లు తెలిపారు. అందుకు తాను సిగ్గుపడటం లేదన్నారు. అలాగే దీన్ని దాచాలనుకోవడం లేదని కూడా ప్రకాష్ రాజ్ తేల్చిచెప్పేశారు. చివరిగా తనకు అలవాటైన జస్ట్ ఆస్కింగ్ పంచ్ కూడా పెట్టారు.

Public Notice
— Prakash Raj (@prakashraaj) August 27, 2025
To,
The Citizens &
The Prime Minister of INDIA
I am Prakash Raj, i am not a DEGREE holder.
I discontinued to pursue my creative career.
I am not ASHAMED of it.
I don’t want to HIDE it . #justasking pic.twitter.com/yo8uB2mSiC
ప్రధాని మోడీ బీఏ డిగ్రీ వివరాలను ఇచ్చేందుకు ఢిల్లీ యూనివర్సిటీ నిరాకరించింది. గతంలో ఆయన చదివిన ఎంఏ డిగ్రీ వివరాలు ఇచ్చేందుకు గుజరాత్ యూనివర్సిటీ కూడా నిరాకరించింది. దీనిపై కొన్నేళ్లుగా విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. అయినా ప్రధాని మోడీ ఇవేవే పట్టించుకోవడం లేదు. బీజేపీ కార్యకర్తలు మాత్రం ఇలా డిగ్రీలు అడుగుతున్న మోడీ ప్రత్యర్థులపై ఎదురుదాడి చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే ప్రకాష్ రాజ్ వంటి వారు ఇలాంటి ట్వీట్లు పెడుతున్నారు.
-
మోదీ-ట్రంప్ వార్ ఫోన్ కాల్ మధ్యలో మస్క్- షాకింగ్ ట్విస్ట్ -
PM Modi: సీఎంలకు మోడీ సందేశం ఇదే..! మళ్లీ ఆ కోవిడ్ మోడల్..! -
సంక్షోభం వస్తే మీ సన్నద్ధత ఎంత ? సీఎంల భేటీలో ప్రధాని మోడీ..! -
మార్కాపురం బస్సు ప్రమాద బాధితుల కోసం ప్రధాని కీలక ప్రకటన..!! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!!












Click it and Unblock the Notifications