వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రధానిగా మోడీ అర్హుడేనా, అనర్హుడా, ప్రకాష్ రాజ్: కన్నడ హీరో కౌంటర్, తమిళ సేవ!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: బహుబాష నటుడు, నిర్మాత, దర్శకుడు ప్రకాష్ రాజ్ ప్రధాని నరేంద్ర మోడీపై వివాదాస్పద ట్వీట్ చేసి సాటి నటుడి దగ్గర సోషల్ మీడియాలో చివాట్లు తింటున్నాడు. భారతదేశ ప్రధానిగా నరేంద్ర మోడీ అర్హుడేనా ? అనర్హుడా అని నటుడు ప్రకాష్ రాజ్ జస్ట్ ఆస్కింగ్ అంటూ ట్వీట్ చేశాడు. ఇంత కాలం తమిళ సేవ చేసి ఇప్పుడు కన్నడిగులకు సేవ చెయ్యడానికి వచ్చావా ? అంటూ కన్నడ హీరో కౌంటర్ ఇచ్చారు.

 నీకు ఏమి అర్హత ఉంది?

నీకు ఏమి అర్హత ఉంది?

ప్రకాష్ రాజ్ తీరుపై స్యాండిల్ వుడ్ ప్రముఖ హీరో, బీజేపీ నాయకుడు జగ్గేష్ మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోడీని ప్రశ్నించే ముందు నీకు ఉన్న అర్హతలు ఏమిటో చెప్పాలని సోషల్ మీడియాలో ప్రశ్నించారు. నువ్వు రాజకీయ నాయకుడు కాదు, ఆ అనుభవం లేదు, పోని నువ్వు రాజనీతి శాస్ర్త విద్యార్థివా అంటే అది కాదని జగ్గేష్ మండిపడ్డారు.

తమిళ వాసన

తమిళ వాసన

జీవితాంతం తమిళనాడులో ఉండిపోయి, అక్కడి ప్రజలకు అన్యాయం జరిగిపోయింది అంటూ అనేక సార్లు చెప్పిన నువ్వు ఇప్పుడు ఉన్నట్టుండి కన్నడిగులకు సేవ చెయ్యడానికి ఎందుకు సిద్దం అయ్యావో చెప్పాలని హీరో జగ్గేష్ ప్రకాష్ రాజ్ ను నిలదీశారు.

రాత్రికి రాత్రి లీడర్

రాత్రికి రాత్రి లీడర్

పత్రి నిత్యం ప్రధాని నరేంద్ర మోడీ మీద ఆరోపణలు చేసే నువ్వు రాత్రికిరాత్రి జాతీయ నాయకుడు అయిపోవాలని చూస్తున్నావా, లేక ఉద్దరగా ప్రచారం వస్తుందని ఇలా చేస్తున్నావా అని హీరో జగ్గేష్ ప్రశ్నించారు. నన్వు సినీ రంగంలో అడుగుపెట్టే సమయంలో నీ జీవితం ఎలా ఉందో ఒక సారి గుర్తు చేసుకోవాలని హీరో జగ్గేష్ ప్రశ్నించారు.

ప్రశ్నించు కాని!

ప్రశ్నించు కాని!

చట్టప్రకారం ప్రశ్నించే హక్కు నీకుంది, ప్రశ్నించు కాదనలేదు, అయితే కాంగ్రెస్ నాయకుల దగ్గర మంచి పేరు తెచ్చుకునేందుకు, ఉద్దర ప్రచారం కోసం ఇష్టం వచ్చినట్లు ప్రశ్నిస్తే ఇలాగే ఉంటుందని, సాటి నటుడు అని కూడా చూడకుండా తగిన బుద్ది చెప్పవలసి వస్తోందని హీరో జగ్గేష్ ప్రకాష్ రాజ్ ను సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో హెచ్చరించారు.

English summary
Catch the interesting discussion via Tweets between Actor Prakash Raj and actor cum politician Jaggesh. Prakash Raj with his justasking hashtag has given answer to Jaggesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X