Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రజనీ సైనికుడవుతున్న శిష్యుడు లారెన్స్: డేట్ ఫిక్స్, వా తలైవా వీడియో!

చెన్నై: సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ కు రాజకీయంగా మద్దతు ఇవ్వడానికి తమిళ సినీ ప్రములు ముందుకు వస్తున్నారా అంటే అవుననే సమాధానం వస్తోంది. సినీ దర్శకుడు, బహుబాష నటుడు, నృత్య దర్శకుడు రాఘవ లారెన్స్ తాను రజనీ రక్షకుడిగా మారుతున్నానని పరోక్షంగా సందేశాలు ఇచ్చి వా తలైవా అంటూ ప్రత్యేక వీడియో తయారు చేయించి విడుదల చేశారు.

Recommended Video

    Rajinikanth : తమిళ రాజకీయాలు చూసి నవ్వుతున్నారు, సొంతగానే పార్టీ పెడతా
     లారెన్స్ సమాజసేవ

    లారెన్స్ సమాజసేవ

    పిల్లల శరణాలయం, వృద్ధాశ్రమం, వైద్య, విద్యకు సహాయం చేస్తూ పలు సామాజిక సేవలు చేస్తున్న రాఘవ లారెన్స్‌ రాజకీయాల గురించి తరచూ తనదైన శైలిలో స్పందిస్తున్నారు. ఇప్పుడు రాఘవ లారెన్స్ మరో సంచలనానికి తెర తియ్యడానికి సిద్దం అయ్యారు.

     సంచలనం

    సంచలనం

    సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్‌ రాజకీయ రంగప్రవేశం గత ఆదివారం జాతీయ మీడియాలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. రజనీకాంత్ రాజకీయ రంగప్రవేశ ప్రకంపనలు ఇంకా సద్దుమణగక ముందే రాఘవ లారెన్స్‌ మరో సంచలన వ్యాఖ్యలు చేశారు.

    జల్లికట్టు పోరాటం !

    జల్లికట్టు పోరాటం !

    2017 జనవరిలో చెన్నై మెరీనా బీచ్ లో జరిగిన జల్లికట్టు పోరాటం సమయంలో అవసరం అయితే రాజకీయాల్లోకి రావడానికి తాను వెనుకడుగు వెయ్యను అంటూ రాఘవ లారెన్స్ సంచలన ప్రకటన చేసి పెద్ద దుమారం రేపిన విషయం తెలిసిందే.

    రజనీ వీరాభిమాని

    రజనీ వీరాభిమాని

    సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్‌కు తాను వీరాభిమాని అంటూ రాఘవ లారెన్స్ అనేక సార్లు బహిరంగంగా చెప్పిన విషయం తెలిసిందే. రజనీకాంత్ రాజకీయాల్లోకి వచ్చి ప్రజాసేవ చెయ్యాలని కోరుకునే వారిలో తాను మొదటి వరసలో ఉంటానని రాఘవ లారెన్స్ ఇప్పటికే చెప్పారు.

     ఇద్దరి గురువు ఆయనే

    ఇద్దరి గురువు ఆయనే

    రజనీకాంత్ గురువుగా బావించేది రాఘవేంద్రస్వామిని అనే విషయం తెలిసిందే. రాఘవ లారెన్స్ సైతం రాఘవేంద్రస్వామి భక్తుడు. ఇద్దరి గురువు రాఘవేంద్రస్వామి. ఇప్పుడు తన సినీ రంగం గురువు రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తున్నానని ప్రకటించిన వెంటనే రాఘవ లారెన్స్ వా తలైవా అంటూ ప్రత్యేక వీడియో విడుదల చెయ్యడంతో అది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

    సేవకులు కావాలి

    సేవకులు కావాలి

    రాజకీయరంగ ప్రవేశం గురించి ప్రకటించిన తరువాత అభిమానులు ఉద్దేశించి సూపర్ స్టార్ రజనీకాంత్‌ మాట్లాడుతూ తనకిప్పుడు కావలసింది కార్యకర్తలు కాదని, సేవకులని చెప్పిన విషయం తెలిసిందే. ప్రజలకు సేవ చెయ్యాలంటే తనతో పాటు అందరూ సేవకులు కావాలని రజనీకాంత్ తన అభిమానులకు పిలుపునిచ్చారు.

    రజనీ రాజకీయంపై లారెన్స్

    రజనీ రాజకీయంపై లారెన్స్

    సూపర్ స్టార్ రజనీకాంత్‌ రాజకీయరంగ ప్రవేశం గురించి మీడియా అడిగిన ప్రశ్నకు రాఘవ లారెన్స్‌ సమాధానం ఇస్తూ ఎవరైనా ప్రజలకు మంచి చెయ్యడానికే రాజకీయాల్లోకి రావాలనుకుంటారని, రజనీకాంత్‌ అదే చేస్తున్నారని చెప్పారు.

    డేట్ ఫిక్స్ చేసిన లారెన్స్

    రజనీకాంత్ రాజకీయాల్లోకి వచ్చారని, మీరెప్పుడు వస్తారని మీడియా అడిగిన ప్రశ్నకు జనవరి 4వ తేదీ గురువారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి పూర్తి వివరాలు చెబుతానని రాఘవ లారెన్స్ అన్నారు. అయితే తాను ఇప్పటికే రాజకీయాల్లోకి వచ్చేశానని, కాలం అన్నీ నిర్ణయిస్తోందని రాఘవ లారెన్స్ బాంబు పేల్చారు. మొత్తం మీద రజనీకాంత్ పార్టీలో చేరడానికి తనకు ఎలాంటి ఇబ్బంది లేదని బహుబాష నటుడు రాఘవ లారెన్స్ పరోక్షంగా సమాధానం ఇచ్చారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+