కర్ణాటకలో కాలా సినిమా బ్యాన్: భద్రత కల్పించాలి, దేవేగౌడ మీద నమ్మకం: రజనీకాంత్ మనవి!
బెంగళూరు: కాలా సినిమా విడుదలకు ఎలాంటి సమస్యలు ఎదురుకాకుండా కర్ణాటక ప్రభుత్వం భద్రత కల్పించాలని సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ మనవి చేశారు. కాలా సినిమా విడుదలకు ఎలాంటి అటంకాలు ఎదురుకాకుండా కర్ణాటక ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రజనీకాంత్ ఆశాభావం వ్యక్తం చేశారు. కాలా సినిమా బ్యాన్ కు దేవేగౌడ అంగీకరించరని రజనీకాంత్ ధీమా వ్యక్తం చేశారు.
Recommended Video


అనుమానం లేదు
కర్ణాటకలో కాలా సినిమా విడుదలకు అడ్డంకులు ఏర్పడుతాయని తనకు ఎలాంటి అనుమానాలు లేవని రజనీకాంత్ అంటున్నారు. అయితే ఒక సినిమాను సినిమాలాగా చూడాలని, అందులో రాజకీయం చెయ్యకూడదని రజనీకాంత్ కన్నడ సంఘాలకు మనవి చేశారు.

అన్ని బాషలు సమానం
కర్ణాటకలో నివాసం ఉంటున్న కేవలం తమిళ ప్రజలు మాత్రమే కాదని, అన్ని బాషలు మాట్లాడే సినీ ప్రేక్షకులు కాలా సినిమాను చూడాలని ఎదురుచూస్తున్నారని, ఒక మంచి చిత్రం ప్రేక్షకులు చూడకుండా అడ్డుకోవడం ఎంత వరకూ న్యాయమని రజనీకాంత్ అంటున్నారు.

భద్రత కల్పించండి
కాలా సినిమా విడుదల అయ్యే సినిమా థియేటర్లకు, సినిమా చూడటానికి వచ్చే ప్రేక్షకులకు కర్ణాటక ప్రభుత్వం భద్రత కల్పించాలని సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ మనవి చేశారు. కాలా సినిమా విడుదల కాకుండా కన్నడిగులు అడ్డుకోరనే నమ్మకం ఉందని రజనీకాంత్ ఆశాభావం వ్యక్తం చేశారు.

దేవేగౌడ మీద నమ్మకం
కాలా సినిమా విడుదల కాకుండా నిషేదం విదించడానికి మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడ అవకాశం ఇవ్వరనే నమ్మకం తనకు ఉందని రజనీకాంత్ ధీమా వ్యక్తం చేశారు. దేవేగౌడ లాంటి పెద్ద మనిషి అక్కడ ఉన్నంతరకు కాలా సినిమాకు అన్యాయం జరగదని నమ్ముతున్నానని రజనీకాంత్ అంటున్నారు.

రజనీకాంత్ ధీమా
కాలా సినిమా విడుదల కాకుండా అడ్డుకుంటే చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి రజనీకాంత్ తో పాటు ఆ సినిమా కర్ణాటక పంపిణిదారులు సిద్దం అయ్యారు. ఇప్పటికే కన్నడ సంఘాలతో చర్చలు జరిపిన పంపిణిదారులు కాలా సినిమా విడుదలకు అవకాశం ఇవ్వాలని ప్రభుత్వానికి మనవి చేస్తున్నారు.












Click it and Unblock the Notifications