నటిని చితకబాదేసిన గ్రామస్తులు, హంగామా చేస్తే చిర్రెత్తిందని, అసలు మ్యాటర్ !
బెంగళూరు/శివమొగ్గ: సినిమాల్లో నటిస్తున్న యువతి డబ్బులు బాగానే సంపాధిస్తున్నది. సొంత ఊరిలో పొలం కొనుకున్న ఆ నటి ఆమె కుటుంబ సభ్యులకు ఆ పొలం అప్పగించింది. నటి కుటంబ సభ్యులు ఆ పొలం చూసుకుంటున్నారు. అయితే కొనుగోలు చేసిన పొలం విషయంలో గొడవలు జరగడంతో స్థానికులు ఆ నటిని పట్టుకుని చితకబాదడంతో తీవ్రగాయాలైనాయి.
బెంగళూరులో నివాసం ఉంటున్న అను గౌడ కన్నడ సినిమాల్లో నటిస్తోంది. కన్నడ సినిమాలతో పాటు తమిళ సినిమాల్లో నటిస్తున్న అను గౌడకు కన్నడ, తమిళ టీవీ సీరియల్స్ కూడా చక్కటి అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటికే విష్ణువర్దన్, హ్యాట్రిక్ హీరో శివరాజ్ కుమార్, పునీత్ రాజ్ కుమార్, కిచ్చా సుదీప్ తదితరుల సినిమాల్లో అను గౌడ నటించింది.

సూపర్ డూపర్ హిట్ అయిన కెంపేగౌడ, హుడగరు, దండం దశగుణం, సవిసవి నెనపు, స్కూల్ మాస్టర్ తదితర కన్నడ సినిమాల్లో అను గౌడ నటించింది. కన్నడ సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్న అను గౌడకు తమిళ సినిమాల్లో కూడా చక్కటి అవకాశాలు వచ్చాయి. కన్నడ, తమిళ సినిమాల్లో నటిస్తూ బాగా డబ్బులు సంపాధించిన అను గౌడ ఇప్పుడు కూడా తమిళ, కన్నడ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటున్నది.
బెంగళూరులో నివాసం ఉంటున్న అను గౌడ తల్లిదండ్రులు కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలోని సాగర తాలుకాలోని కాస్పాడి గ్రామంలో నివాసం ఉంటున్నారు. సినిమాల్లో నటిస్తు డబ్బులు బాగా సంపాధిస్తున్న అను గౌడ సాగర తాలుకాలోని కాస్పాడి గ్రామంలోని సర్వే నెంబర్ 43లో కొన్ని ఎకరాల పొలం కొనుగోలు చేసింది.

నటి అను గౌడకు చెందిన పొలం ఆమె తల్లిదండ్రులు చూసుకుంటున్నారు. పొలం విషయంలో స్థానికులకు నటి అను గౌడ కుటుంబ సభ్యులకు గొడవ జరిగింది. విషయం తెలుసుకున్న అను గౌడ బెంగళూరు నుంచి ఆమె సొంత గ్రామానికి వెళ్లింది. ఆ సమయంలో పక్క పొలం వాళ్లకు నటి అను గౌడల మధ్య పెద్ద గొడవ జరిగింది. ఆ సందర్బంలో స్థానిక గ్రామస్తులకు, నటి అను గౌడల మధ్య పెద్ద గొడవ జరిగింది.
ఆ సమయంలో సహనం కోల్పోయిన స్తానికులు నటి అను గౌడతో పాటు ఆమె కుటుంబ సభ్యులను పట్టుకుని చితకబాదేశారు. తీవ్రగాయాలైన నటి అను గౌడ సాగర ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. స్థానికంగా నివాసం ఉంటున్న మోహన్, నీలమ్మ తదితరులు తన మీద దాడి చేశారని నటి అను గౌడ పోలీసులకు ఫిర్యాదు చేశారని, కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని సాగర గ్రామీణ పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications