హీరో కమల్ హాసన్ మోసం చేశారు, మాజీ ప్రియురాలు గౌతమి ఫైర్, శృతి హాసన్, 13 ఏళ్లు!
చెన్నై: విశ్వనటుడు, దర్శక నిర్మాత, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ పై ఆయన మాజీ ప్రియురాలు, బహుబాష నటి గౌతమి ఆరోపణలు గుప్పించారు. కమల్ హాసన్ తో తనకు ఇప్పుడు ఎలాంటి సంబంధం లేదని, మక్కల్ నీది మయ్యమ్ పార్టీకి తన మద్దతు లేదని గౌతమి స్పష్టం చేశారు. అయితే కమల్ హాసన్ సినిమాలకు కాస్టుమ్ డిజైనర్ గా పని చేసిన తనకు ఇంకా పారితోషికం ఇవ్వలేదని, మోసం చేశారని, ఆ విషయంలో శృతి హాసన్ కు ఎలాంటి సంబంధం లేదని గౌతమి అన్నారు. అయితే గౌతమి పారితోషికం విషయం రాజ్ కమల్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ చూసుకుంటుందని హీరో కమల్ హాసన్ అంటున్నారు.

13 ఏళ్ల రిలేషన్ కట్
కమల్ హాసన్ తో తన 13 ఏళ్ల సంబంధానికి 2016లో బ్రేక్ పడిందని, ఇప్పుడు ఆయనతో తనకు ఎలాంటి సంబంధం లేదని నటి గౌతమి సోషల్ మీడియాలో వివరణ ఇచ్చారు. సంబంధంలేని వ్యక్తి గురించి తనకు ముడిపెట్టడం పద్దతి కాదని నటి గౌతమి అన్నారు.

ఆధారాలు ఉన్నాయి
కమల్ హాసన్ సొంత నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ తో పాటు ఆయన బయట సంస్థల్లో నిటించిన సినిమాలకు తాను కాస్టుమ్ డిజైనర్ గా పని చేశానని నటి గౌతమి వివరణ ఇచ్చారు. ఆ సమయంలో తనకు పారితోషికం ఇవ్వలేదని, అందుకు తన దగ్గర ఆధారాలు ఉన్నాయని నటి గౌతమి ఆరోపించారు.

కమల్ హాసన్ క్లారిటీ
నటి గౌతమి తన సినిమాలకు కాస్టుమ్ డిజైనర్ గా పని చేశారని, అయితే ఆమె పారితోషికం ఇవ్వలేదని ఆరోపిస్తున్నారని, ఆ విషయం రాజ్ కమల్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ సంస్థ చూసుకుంటుందని మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ వివరణ ఇచ్చారు.

శృతి హాసన్ కారణం !
కమల్ హాసన్ తో 13 ఏళ్లు కలిసి సహజీవనం చేశానని నటి గౌతమి అన్నారు. కమల్ హాసన్ తో విడిపోవడానికి శృతి హాసన్ కారణం అని ప్రచారం జరుగుతోందని, అందులో ఎలాంటి వాస్తవం లేదని నటి గౌతమి స్పష్టం చేశారు. ఇద్దరు పెద్దలు విడిపోవడానికి పిల్లలు కారణం అని నేను అనుకోవడం లేదని గౌతమి అన్నారు.

ఆమె కోసం నా జీవితం
ప్రస్తుతం తన కుమార్తె సుబ్బలక్ష్మి భవిష్యత్తు మీద తాను ఎక్కువ దృష్టి పెట్టానని, ఆమెను ఆర్థికంగా స్థిరపరిచిన తరువాత మిగిలిన విషయాల గురించి ఆలోచిస్తానని, అంత వరకూ ఇతరుల గురించి ఆలోచించే సమయం తనకు లేదని గౌతమి వివరణ ఇచ్చారు.

30 ఏళ్లుగా చూస్తున్నారు
తనను మీరు 30 ఏళ్లుగా చూస్తున్నారు, నేను ఏమిటో మీకు పూర్తిగా తెలుసు, నేను ఏదైనా మాట్లాడితో దానికో అర్థం ఉంటుందని మీకు తెలుసు, ఇంత వరకూ నేను అనవసరంగా ఎవరి మీద ఆరోపణలు చెయ్యలేదు, ఇప్పుడు తన దగ్గర ఆధారాలు ఉన్నాయనే కమల్ హాసన్ మీద ఆరోపణలు చేస్తున్నానని గౌతమి చెప్పారు.

ఇప్పుడా ఆరోపణలు !
హీరో కమల్ హాసన్ రాజకీయ రంగప్రవేశం చేసిన విషయం తెలిసిందే. నటి గౌతమి మక్కల్ నీది మయ్యమ్ పార్టీకి మద్దతు ఇచ్చి ప్రచారం చేస్తారని ఆయన అభిమానులు భావించారు. కమల్ హాసన్ తో విడిపోయిన గౌతమి ఇంతకాలం మౌనంగా ఉన్నారు. అయితే ఇప్పుడు ఎందుకు ఆరోపణలు చేస్తున్నారు అంటూ తమిళనాడులో జోరుగా చర్చ జరుగుతోంది.












Click it and Unblock the Notifications