పోర్న్ వీడియోలు, ఫొటోల అప్‌లోడింగ్: నటి, మోడల్ అరెస్ట్: రూ.2000లకే అడల్ట్ ఫిల్మ్

ముంబై: పోర్న్ వీడియోల అప్‌లోడింగ్ వ్యవహారంలో బాలీవుడ్ నటి అరెస్ట్ అయ్యారు. ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. వెబ్‌సైట్‌లోకి పోర్న్ వీడియోలను అప్‌లోడ్ చేశారనే ఆరోపణలు ఆమె మీద ఉన్నాయి. దీనిపై ఫిర్యాదులు రావడంతో ముంబై క్రైమ్ బ్రాంచ్‌కు చెందిన ప్రాపర్టీ సెల్ పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. న్యాయస్థానం ముందు హాజరు పర్చనున్నారు. ఆమెపై సైబర్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.

గెహెనా వశిష్ఠ్ అసలు పేరు వందనా తివారీ. మిస్ ఆసియా బికినీ టైటిల్ విన్నర్. పలు టీవీ కార్యక్రమాలకు ప్రజెంటర్‌గా వ్యవహరించారు. 80కి పైగా అడ్వర్టయిజ్‌మెంట్లలో నటించారు. కొన్ని టాప్ బ్రాండ్ కంపెనీలకు మోడల్‌గా కనిపించారు. గందీ బాత్ అనే వెబ్ సిరీస్‌లో నటించారు. ఆల్ట్ బాలాజీ దీన్ని నిర్మించింది. ఆమె నటించబోయే కొన్ని మూవీలు సెట్స్‌కు వెళ్లనున్నాయి. ఆమె సొంతంగా ఓ వెబ్‌సైట్‌ను నడిపిస్తున్నారు.

Actress Gehana Vasisth has been arrested by Property Cell of the Crime Branch

ఆ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసిన ఫొటోలు, వీడియోలను చూడాలంటే సబ్‌స్క్రిప్షన్ పొంది ఉండాలి. సబ్‌స్క్రిప్షన్ పొందాలంటే 2000 రూపాయలను చెల్లించాల్సి ఉంటుంది. ఈ వెబ్‌సైట్ కోసం ఆమె 87 పైగా సాఫ్ట్ పోర్న్ వీడియోలను చిత్రీకరించారు. ఈ అడల్ట్ వీడియోలను తన వెబ్‌సైట్‌లోకి అప్‌లోడ్ చేశారు. 2000 రూపాయలను చెల్లించి సబ్‌స్క్రిప్షన్ పొందిన వారు ఈ వీడియోలను చూసే వీలు ఉంటుంది.

అడల్ట్ వీడియోల అప్‌లోడింగ్‌కు సంబంధించి ముగ్గురు వ్యక్తులు ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీన్ని నమోదు చేసుకున్న ఆమెను అరెస్ట్ చేశారు. తమను బలవంతంగా అడల్ట్ ఫిల్మ్‌ ప్రాజెక్ట్‌లోకి తీసుకున్నారని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్‌ చేయడం తమకు ఇష్టం లేనప్పటికీ.. గెహెనా వశిష్ఠ్ తరఫు వ్యక్తులు బెదిరించారని, బ్లాక్ మెయిల్ చేశారని తెలిపారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. న్యాయస్థానం ముందు హాజరు పర్చనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+