Actress: హీరోయిన్ల డ్రగ్స్ డీల్ కేసు, హోమ్ మంత్రి క్లారిటీ, కేసు ఫుల్ స్ట్రాంగ్ అయిపోతుంది, ఫోరెన్సిక్ !
బెంగళూరు/ శివమొగ్గ: స్యాండిల్ వుడ్ హీరోయిన్లు రాగిణి ద్వివేది, సంజనా డ్రగ్స్ కేసులో పోలీసులు పక్కా సాక్షాలు సేకరించారని కర్ణాటక హోమ్ మంత్రి అరగ జ్ఞానేంద్ర అన్నారు. హైదరాబాద్ ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టు మొత్తం బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కోర్టులో సమర్పిస్తారని కర్ణాటక హోమ్ మంత్రి అరగ జ్ఞానేంద్ర మీడియాకు చెప్పారు. డ్రగ్స్ కేసులో ఎవరు నేరం చేసినా కచ్చితంగా చట్టపరంగా శిక్ష అనుభవిస్తారని, పోలీసులు వారి పని వారు చక్కగా చేశారని కర్ణాటక హోమ్ మంత్రి అరగ జ్ఞానేంద్ర అన్నారు. హైదరాబాద్ ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టు మొత్తం బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కోర్టులో సమర్పించిన తరువాత బెంగళూరు డ్రగ్స్ కేసు ఇంకా స్ట్రాంగ్ అయ్యే అవకాశం ఉందని కర్ణాటక హోమ్ మంత్రి అరగ జ్ఞానేంద్ర అన్నారు. హోమ్ మంత్రి క్లారిటీతో హీరోయిన్లు రాగిణి, సంజనాలకు ఇప్పుడు చెమటలు పడుతున్నాయని సమాచారం. కర్ణాటకలో యడియూరప్ప ప్రభుత్వం ఉన్న సమయంలో స్యాండిల్ వుడ్ డ్రగ్స్ కేసు వెలుగు చూసింది. ఇప్పుడు కర్ణాటకలో బసవరాజ్ బోమ్మయ్ ప్రభుత్వం ఉంది. అప్పటి హోమ్ మంత్రి బసవరాజ్ బోమ్మయ్ ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. కర్ణాటకలో అప్పుడు, ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఉన్న సమయంలోనే స్యాండిల్ వుడ్ డ్రగ్స్ అనేక మలుపులు తిరిగింది.

స్యాండిల్ వుడ్ కు షాక్
గత ఏడాది (2020)లో బాలీవుడ్ డ్రగ్స్ కేసు విచారణ చేస్తున్న ఎన్ సీబీ అధికారులకు స్యాండిల్ వుడ్ డ్రగ్స్ కేసు వ్యవహారం తెలిసింది. ఎన్ సీబీ అధికారులు సమాచారం ఇవ్వడంతో బెంగళూరులోని బాణసవాడి పోలీసులు రంగంలోకి దిగారు. బాణసవాడి పోలీసుల చేతి నుంచి బెంగళూరు, స్యాండిల్ వుడ్ డ్రగ్స్ కేసు అప్పట్లోనే బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) అధికారుల చేతికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి కేసు విచారణ జరుగుతోంది.

నెయ్యి పాప అరెస్టుతో కలకలం
బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ అధికారులు మొదట బెంగళూరులోని జయనగర ఆర్ టీఓ కార్యాలయంలో అధికారి రవిశంకర్ ను అరెస్టు చేశారు. రవిశంకర్ ఇచ్చిన సమాచారం మేరకు స్యాండిల్ వుడ్ టాప్ హీరోయిన్ రాగిణి దివ్వేది అరెస్టు అయ్యారు. ఆసమయంలో రవిశంకర్, హీరోయిన్ రాగిణి దివ్వేది ఇచ్చిన సమాచారం మేరకు డ్రగ్స్ డీలర్లు అరెస్టు అయ్యారు.

ప్రబాస్ హీరోయిన్ కు దెబ్బ
బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు కాటన్ పేట పోలీస్ స్టేషన్ లో మరో కేసు నమోదు అయ్యింది. బాణసవాడి, కాటన్ పేట, సీసీబీ పోలీసులు మొత్తం మూడు కేసులు నమోదు అయ్యాయి. సీసీబీ పోలీసులు స్యాండిల్ వుడ్ కు చెందిన మరో హీరోయిన్, ప్రభాస్ బుజ్జిగాడు హీరోయిన్ సంజనాను అరెస్టు చేశారు. నటి సంజనాతో పాటు అప్పుడే రాహుల్ తోన్సే లూయిమ్ పెప్పర్, వివేక్ ఖన్నా తదితరులను పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు.

ఫోరెన్సిక్ ల్యాబ్
సీసీబీ పోలీసులు అరెస్టు చేసిన సమయంలో హీరోయిన్లు రాగిణి, సంజనాతో పాటు ఈ కేసులోని నిందితులు అందరూ తాము డ్రగ్స్ సేవించలేదని పదేపదే చెప్పారు. అయితే పోలీసులు రాగిణి, సంజనాతో పాటు అందరికి రక్త పరీక్షలు నిర్వహించారు. అందరి తల వెంట్రుకలు సేకరించి హైదరాబాద్ లోని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు.

హైదరాబాద్ రిపోర్టుతో మైండ్ బ్లాక్
స్యాండిల్ వుడ్ హీరోయిన్లు రాగిణి దివ్వేది, సంజానా, వీరేన్ ఖన్నా, రవిశంకర్, రాహుల్ తదితరులు పక్కాగా డ్రగ్స్ సేవించారని హైదరాబాద్ లోని ఫోరెన్సిక్ నిపుణుల పరీక్షలలో వెలుగు చూసింది. మేము డ్రగ్స్ సేవించలేదు కావాలనే మా మీద తప్పుడు కేసులు నమోదు చేశారని ఇంతకాలం నానా రచ్చ చేసిన హీరోయిన్లు సంజనా, రాగిణి ఇప్పుడు ఏం చెప్పాలో అర్థంకాక గిలగిలా కొట్టుకునే పరిస్థితి ఎదురైయ్యింది.

ఇప్పుడు ఏమంటారో ?
కొన్ని నెలల క్రితం బెయిల్ మీద బయటకు వచ్చిన సమయంలో రాగిణి, సంజనా వేర్వేరుగా మీడియాతో మాట్లాడుతూ మేము ఏ తప్పు చెయ్యలేదని, ఎప్పటికైనా న్యాయం గెలుస్తుందని పదేపదే మీడియా ముందు చెప్పారు. అయితే ఇప్పుడు ఫోరెన్సిన్ నివేదికలో హీరోయిన్లు రాగిణి, సంజనా తదితరులు డ్రగ్స్ సేవించారని పక్కాగా వెలుగు చూడటంతో వారి మైండ్ బ్లాక్ అవుతోంది. డ్రగ్స్ కేసులో నేరం రుజువు అయితే అందరికీ కఠిన జైలు శిక్ష పడే అవకాశం ఉందని సమాచారం.
Recommended Video

హోమ్ మంత్రి పక్కా క్లారిటీ
హైదరాబాద్ ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టు మొత్తం బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కోర్టులో సమర్పిస్తారని కర్ణాటక హోమ్ మంత్రి అరగ జ్ఞానేంద్ర మీడియాకు చెప్పారు. డ్రగ్స్ కేసులో ఎవరు నేరం చేసినా కచ్చితంగా చట్టపరంగా శిక్ష అనుభవిస్తారని, పోలీసులు వారి పని వారు చక్కగా చేశారని కర్ణాటక హోమ్ మంత్రి అరగ జ్ఞానేంద్ర అన్నారు. హైదరాబాద్ ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టు మొత్తం బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కోర్టులో సమర్పించిన తరువాత బెంగళూరు డ్రగ్స్ కేసు ఇంకా స్ట్రాంగ్ అయ్యే అవకాశం ఉందని కర్ణాటక హోమ్ మంత్రి అరగ జ్ఞానేంద్ర అంటున్నారు.












Click it and Unblock the Notifications