హోటల్లో నటిపై మ్యూజిక్ కంపోజర్ లైంగిక దాడి

న్యూఢిల్లీ: దక్షిణ ఢిల్లీలోని గ్రేటర్ కైలాష్ హోటల్లో మ్యూజిక్ కంపోజర్ తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు 27 ఏళ్ల నటి ఆరోపించారు. ఆమెకు ముంబైలో సొంత ప్రొడక్షన్ హౌస్ కూడా ఉంది. నిందితుడు అంకుర్ శర్మను పోలీసులు అరెస్టు చేసి తీహార్ జైలుకు పంపారు.

ఈ కేసులో 20 రోజుల్లో చార్జిషీట్ దాఖలు చేస్తామని పోలీసులు అంటున్నారు. నటి నుంచి పోలీసులకు ఉదయం 11 గంటలకు ఫోన్ వచ్చింది. రెండు రోజుల క్రితం తాను ఢిల్లీకి వచ్చానని, బిజినెస్ డీల్‌ను పూర్తి చేసుకుని అందుకు సంబంధించినవారితో మాట్లాడానికి వచ్చానని ఆమె పోలీసులకు చెప్పారు.

Actress sexually assaulted by musician at Greater Kailash hotel

తదుపరి ప్రొడక్షన్ వెంచర్‌కు తుది రూపం కల్పించడానికి శర్మ గురువారం ఉదయం ఆమె గదికి వచ్చాడని, అతను నటిపట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ ఎక్కడపడితే అక్కడ ముట్టుకోవడం ప్రారంభించాడని అంటున్నారు. అతని తీరుకు నటి అభ్యంతరం చెప్పిందని, మొదట కాస్తా వెనక్కి తగ్గినట్లు కనిపించినప్పటికీ ఆ తర్వాత అతను దూకుడుగా ప్రవ్రతించాడని తమకు ఫిర్యాదు అందినట్లు పోలీసులు అంటున్నారు.

ఆమె కేకలు వేయడంతో హోటల్ అధికారులు జోక్యం చేసుకున్నారు, ఆ తర్వాత పోలీసులు వచ్చారు. మహిళను వైద్య పరీక్షలకు పంపించారు. అయితే, తనపై వచ్చిన ఆరోపణలను నిందితుడు ఖండిస్తున్నాడు. తాము హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలలో ఇదివరకు నృత్యోత్సవంలో కలిశామని అతను చెప్పాడు. నటి వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేసుకున్నారు.

పోలీసులు హోటల్ సిసిటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు. నిందితుడి డిఎన్ఎ నమూనాలను కూడా పోలీసులు సేకరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+