Actress: నటి ఆత్మహత్య కేసులో ట్విస్ట్, సిరాజుద్దీన్ కు నోటీసులు, దీపా ఐఫోన్ లో ? !

చెన్నై/సత్యవేడు: నటిగా ఎదుగుతున్న సమయంలో తెలుగు అమ్మాయి పవలెన్ జెస్సికా అలియాస్ దీపా అపార్ట్ మెంట్ లో ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్య చేసుకునే ముందు నటి జెస్సికా డెత్ నోట్ రాసిపెట్టింది. నేను జీవితాంతం నిన్నే మాత్రమే ప్రేమించాను, ఎక్కడ ఉన్నా నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను అని ఆ నటి డెత్ నోట్ రాసింది. ప్రముఖ దర్శకుడితో పీకలలోతు వరకు ప్రేమలో మునగిపోయిన నటి జెస్సికా ఆమె ప్రేమ విఫలం అయ్యిందని ఆత్మహత్య చేసుకుందని పోలీసుల విచారణలో వెలుగు చూడటం తమిళ సినీ పరిశ్రమతో పాటు ఆంధ్రప్రదేశ్ లో ఆమె సొంత ఊరిలో కలకలం రేపింది. అయితే డెత్ నోట్ లో వివరాల ఆధారంగా, నటి జెస్సికా ఐఫోన్ లోని వివరాలు ఆధారంగా ఓ వ్యక్తికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. నటి జెస్సికా ఆత్మహత్య చేసుకుందని మొదట పోలీసులకు చెప్పిన వ్యక్తి నుంచి కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.

 చెన్నై వెళ్లిన తెలుగు అమ్మాయి

చెన్నై వెళ్లిన తెలుగు అమ్మాయి

ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలోని సత్యవేడులో పవలెన్ జెస్సికా అలియాస్ దీపా (29) అనే యువతి నివాసం ఉండేది. సోషల్ మీడియా, ఇన్ స్టా రీల్స్, టిక్ టాక్, యూట్యూబ్ చానల్స్ ద్వారా తన కొంటె నటనతో జెస్సికా లక్షలాది మంది అభిమానులను సంపాధించుకుంది. సినిమాల్లో నటించాలని ఆశతో జెస్సికా నాలుగు సంవత్సరాల క్రితం చెన్నై వెళ్లింది.

 అపార్ట్ మెంట్ లో నటి

అపార్ట్ మెంట్ లో నటి

చెన్నై చేరుకున్న జెస్సికా కోయంబేడు సమీపంలోని విరుగంబాక్కంలోని మల్లికై అవెన్యూ అపార్ట్ మెంట్ లోని ఫ్లాట్ అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నది. పవలెన్ జెస్సికా తమిళ సినిమా చాన్స్ ల కోసం ప్రయత్నించింది. పవలెన్ జెస్సికా అలియాస్ దీపాకు మొదట తమిళ టీవీ సీరియల్స్ లో నటించే అవకాశం వచ్చింది.

 అందరూ హ్యాపీ

అందరూ హ్యాపీ

థేరి, తుప్పలవారియన్, రాడ్ సన్ తదితర సినిమాల్లో నటించడానికి అవకాశం వచచిింది. కొత్త హీరో మహేంద్రన్ హీరోగా దర్శకుడు మహివర్మన్ దర్శకత్వంలో తెరకెక్కిన వైధ అనే సినిమాలో హీరోయిన్ గా చాన్స్ దక్కించుకుంది. వైధ సినిమాలో హీరోయిన్ గా నటించిన జెస్సికా అలియాస్ దీపా నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుని ఆమెకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. జెస్సికాతో పాటు ఆమె కుటుంబ సభ్యులు స్నేహితులు ఆమె ఎదుగుదలచూసి సంతోషించారు.

 నటి ఆత్మహత్య

నటి ఆత్మహత్య

తమిళ నటి జెస్సికా అలియాస్ దీపా ఆమె నివాసం ఉంటున్న అపార్ట్ మెంట్ లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది, జెస్సికా ఆత్మహత్య చేసుకునే ముందు డెత్ నోట్ రాసిపెట్టింది. నేను జీవితాంతం నిన్నే ప్రేమిస్తాను, ప్రేమిస్తూనే ఉంటాను అని ఆ నటి డెత్ నోట్ రాసిందని చెన్నై సిటీ పోలీసులు చెప్పారు.

 పోలీసులకు మ్యాటర్ చెప్పింది ప్రభాకర్

పోలీసులకు మ్యాటర్ చెప్పింది ప్రభాకర్

నటి జెస్సికా ఆత్మహత్య చేసుకుందని మొదట పోలీసులకు సమాచారం ఇచ్చింది ప్రభాకర్ అనే వ్యక్తి. జెస్సికా అపార్ట్ మెంట్ లో, పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాలు పరిశీలించిన పోలీసులు మొదట ప్రభాకర్ ను పట్టుకున్నారు. ప్రభాకర్ ను విచారణ చేసిన పోలీసులు సిరాజుద్దీన్ అనే వ్యక్తి గురించి సమాచారం తెలుసుకున్నారు.

 నటి ఐఫోన్ లో అసలు మ్యాటర్

నటి ఐఫోన్ లో అసలు మ్యాటర్

దీపాకు చెంది ఐఫోన్ ను పోలీసలు స్వాధీనం చేసుకున్నారు. అయితే దీపాకు చెందిన మరో ఫోన్ ను ప్రభాకర్ పగలగొట్టాడని పోలీసులు అంటున్నారు. సిరాజుద్దీన్ చెప్పడం వలనే తాను ఫోన్ పగలగొట్టానని ప్రభాకర్ చెప్పాడని పోలీసులు అంటున్నారు. దీపా ఆత్మహత్య చేసుకునే రోజు సిరాజుద్దీన్ తో చాలాసేపు మాట్లాడిందని, తరువాత ఆత్మహత్య చేసుకుందని పోలీసుల విచారలో వెలుగు చూసింది.

 నోటీసులు ఇచ్చినా సిరాజ్ ఎందుకురాలేదు ?

నోటీసులు ఇచ్చినా సిరాజ్ ఎందుకురాలేదు ?

దీపా ఇంటి తలుపులు పలగొట్టి చూడాలని సిరాజుద్దీన్ ప్రభాకర్ కు ఫోన్ చేసి చెప్పాడని పోలీసులు అంటున్నారు. విచారణకు హాజరుకావాలని సిరాజుద్దీన్ కు నోటీసులు ఇచ్చినా అతను ఇంతవరకు విచారకు హాజరుకాలేదని నటి దీపా అలియాస్ జెస్సికా కేసు దర్యాప్తు చేస్తున్న ఓ పోలీసు అధికారులు అంటున్నారని తమిళ మీడియా అంటోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+