బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Actress: హీరోయిన్ చిన్నపిల్లా ?, చాందినికి అన్నీ తెలిసి వెళ్లింది, ఆ మొబైల్ చిక్కలేదు, బెయిల్ వద్దు !

|
Google Oneindia TeluguNews

చెన్నై: ప్రముఖ హీరోయిన్, మలేషియా రాయబార కార్యాలయం అధికారిని చాందినిని మోసం చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న తమిళనాడు మాజీ మంత్రి మణికందన్ కు బెయిల్ మంజూరు కాలేదు. కేసు వాదన విన్న హైకోర్టు మాజీ మంత్రి బెయిల్ పిటిషన్ విచారణ తీర్పును రిజర్వు చేసింది. చాందిని మలేషియా రాయబార కార్యాలయంలో ఉన్నతస్థాయి ఉద్యోగం చేస్తోంది, పైగా ఆమె సినిమా నటి, మణికందన్ కు ఇంతకు ముందే పెళ్లి జరిగి పిల్లలు ఉన్నారని ఆమెకు అన్నీ తెలిసి వెళ్లిందని, ఇద్దరూ ఇష్టపడి కలిసి జీవించారు, ఆమెను మోసం చేసి, బెదిరించి మణికందన్ ఆమెను లొంగదీసుకోలేదని మాజీ మంత్రికి బెయిల్ ఇవ్వాలని తరపు న్యాయవాది అంటున్నారు.

మాజీ మంత్రి మణికందన్ ఆయన పలుకుబడితో బెదిరించి చాందినితో అబార్షన్ చేయించారని, ఆమె ఏకాంతంగా ఉన్న సమయంలో తీసిన వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని, చంపేస్తానని బెదిరించాడని, ఆయన మొబైల్ ఒకటి ఇంకా పోలీసులకు చిక్కలేదని, ఆయనకు బెయిల్ ఇస్తే సాక్షాలు నాశనం చేసే అవకాశం ఉందని, ఆయనకు బెయిల్ ఇవ్వకూడదని చాందిని తరుపు న్యాయవాది అంటున్నారు.

Illegal affair: భర్త వైస్ ప్రిన్సిపాల్, బెడ్ రూమ్ లో బోరుకొట్టాడని ?, కొడుకు వయసున్న ప్రియుడితో !Illegal affair: భర్త వైస్ ప్రిన్సిపాల్, బెడ్ రూమ్ లో బోరుకొట్టాడని ?, కొడుకు వయసున్న ప్రియుడితో !

 ప్రియుడు మీద కేసు పెట్టిన హీరోయిన్ చాందిని

ప్రియుడు మీద కేసు పెట్టిన హీరోయిన్ చాందిని

పెళ్లి చేసుకుంటానని నమ్మించిన మాజీ మంత్రి మణికందన్ తనతో చెన్నైలో రహస్యంగా కాపురం పెట్టాడని, ఇద్దరూ కలిసి ఐదు సంవత్సరాలు సహజీవనం చేశామని నటి చాందిని ఆరోపిస్తోంది. మొదటి భార్యకు విడాకులు ఇచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటానని మాజీ మంత్రి మణికందన్ తనను నమ్మించాడని, తనతో ఎంజాయ్ చేసి తన సర్వస్వం దోచుకున్న తరువాత మోసం చేశాడని తమిళ హీరోయిన్, మలేషియా రాయబార కార్యాలయం అధికారిని చాందిని చెన్నైలో కేసు పెట్టింది.

 సీక్రెట్ వీడియోలతో చాందినికి భయం ?

సీక్రెట్ వీడియోలతో చాందినికి భయం ?

నువ్వు నా మీద పోలీసు కేసు పెడితే ఇంతకాలం మనం కాపురం చేసే సమయంలో రహస్యంగా బెడ్ రూమ్ లో తీసిన నీ అశ్లీల వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని మణికందన్ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని నటి చాందిని చెన్నై సిటీ పోలీసు కమీషనర్ కార్యాలయంలో, మహిళా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసింది. ఏరోజు చాందినిని మణికందన్ బ్లాక్ మెయిల్ చెయ్యడం మొదలుపెట్టాడో ఆరోజు అతని మీద నమ్మకం లేక పోలీసులను ఆశ్రయించిందని సమాచారం.

 చాందిని దెబ్బకు మాజీ మంత్రి

చాందిని దెబ్బకు మాజీ మంత్రి

తనకు మొదటి నుంచి బెడ్ రూమ్ లో సీక్రెట్ కెమెరాలతో రికార్డు చేస్తున్నాడని మణికందన్ మీద అనుమానం ఉందని చాందిని ఇంతకు ముందే మీడియా ముందు చెప్పింది. చాందిని కేసు పెట్టిన తరువాత మాజీ మంత్రి మణికందన్ చెన్నై నుంచి పరారైనాడు. గుట్టుచప్పుడు కాకుండా బెంగళూరు చేరుకున్న మణికందన్ ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని హెబ్బగుడిలోని ఓ ప్రముఖుడి రిసార్టులో దర్జాగా ఎంజాయ్ చేస్తున్న సమయంలో తమిళనాడు పోలీసులకు అడ్డంగా చిక్కిపోయారు.

 రెండు ఫోన్లు చిక్కాయి.... మూడో ఫోన్ లో ?

రెండు ఫోన్లు చిక్కాయి.... మూడో ఫోన్ లో ?

మాజీ మంత్రి మణికందన్ దగ్గర ఉన్న రెండు మొబైల్ ఫోన్లు పోలీసులు సీజ్ చేశారు. మణికందన్ మొబైల్ ఫోన్లలో దిమ్మతిరిగిపోయే వీడియోలు బయటపడ్డాయని తెలిసింది. హీరోయిన్ చాందినితో ఆయన బెడ్ రూమ్ లో ఏకాంతంగా ఎంజాయ్ చేస్తున్న నగ్న వీడియోలు, ఇద్దరు మద్యం సేవిస్తున్న వీడియోలు, చాందిని బాత్ రూమ్ లో స్నానం చేస్తున్న సమయంలో తీసిన వీడియోలు 100కు పైగా ఉన్నాయని పోలీసు అధికారులు అంటున్నారు. ఆ మొబైల్ ఫోన్లను ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసుల సహాయంతో ఫోరెన్సిక్ ల్యాబ్ అధికారులకు అప్పగించారు. మణికందన్ ఉపయోగించిన మరో ఫోన్ చిక్కలేదని పోలీసులు అంటున్నారని తెలిసింది.

బెయిల్ కోసం ప్రయత్నాలు

బెయిల్ కోసం ప్రయత్నాలు

తమిళనాడు మాజీ మంత్రి మణికందన్ తనకు బెయిల్ మంజూరు చెయ్యాలని ఇప్పటికే చెన్నై హైకోర్టును ఆశ్రయించాడు. హైకోర్టు న్యాయమూర్తి నిర్మల్ కుమార్ కేసు వివరాలు తెలుసుకుని ఇరు వర్గాల వాదనలు విన్నారు. ఈ సమయంలో మాజీ మంత్రి మణికందన్ న్యాయవాది, హీరోయిన్ చాందిని తరపు న్యాయవాది వారి వాదనలను కోర్టులో వినిపించారు.

 చాందిని చిన్నపిల్ల కాదు కదా ?

చాందిని చిన్నపిల్ల కాదు కదా ?

మాజీ మంత్రి మణికందన్ తరపున సీనియర్ న్యాయవాది కేఎస్. దినకరన్ హైకోర్టులో వాదనలు వినించారు. చాందిని మలేషియా రాయబార కార్యాలయంలో ఉన్నతస్థాయి ఉద్యోగం చేస్తోంది, పైగా ఆమె సినిమా నటి, మణికందన్ కు ఇంతకు ముందే పెళ్లి జరిగిందని, భార్య, పిల్లలు ఉన్నారని ఆమెకు అన్నీ తెలిసి వెళ్లింది, ఇద్దరూ ఇష్టపడి కలిసి సహజీవనం చేశారు, ఆమెను మణికందన్ మోసం చేసి, బెదిరించి లొంగదీసుకోలేదని, ఇద్దరు ఇష్ట ప్రకారమే ఇంతకాలం కలిసి ఉన్నారని మాజీ మంత్రి మణికందన్ న్యాయవాది కేఎస్. దినకరన్ అన్నారు.

సీక్రెట్ వీడియోలు విడుదల కాలేదు

సీక్రెట్ వీడియోలు విడుదల కాలేదు

చాందిని అంగీకారంతోనే ఆమెకు అబార్షన్ జరిగిందని, ఆమె ఆసుపత్రిలో సంతకాలు చేసిందని మణికందన్ న్యాయవాది కేఎస్. దినకరన్ చెప్పారు. చాందిని ఆరోపిస్తున్నట్లు ఆమె వ్యక్తిగత వీడియోలు, ప్రైవేట్ ఫోటోలను తన క్లైంట్ మణికందన్ సోషల్ మీడియాలో విడుదల చెయ్యలేదని, ఆమె కావాలని కక్షపెంచుకుని ఆయన్ను కేసులో ఇరికించిందని, మణికందన్ కు బెయిల్ మంజూరు చెయ్యాలని, కోర్టు విచారణకు తప్పకుండా హాజరౌతారని ఆయన తరపు న్యాయవాది కేఎస్. దినకరన్ కోర్టుకు మనవి చేశారు.

 భార్య హోదాలో ఆసెంబ్లీకి చాందిని ?

భార్య హోదాలో ఆసెంబ్లీకి చాందిని ?

హీరోయిన్ చాందినిని భార్య హోదాలో ఇంతకు ముందు మణికందన్ తమిళనాడు అసెంబ్లీలోకి పిలుచుకుని వెళ్లారని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశారని ఆమె తరుపు న్యాయవాది కోర్టులో చెప్పారు. మణికందన్ కు చెందిన మొబైల్ ఫోన్ ఒకటి ఇంకా పోలీసులకు చిక్కలేదని, ఆ మొబైల్ ఫోన్ నెంబర్ నుంచి మణికందన్ చాందినికి వార్నింగ్ ఇస్తూ పంపించిన మెసేజ్ లు ఉన్నాయని ఆమె తరపు న్యాయవాది ఆరోపించారు.

English summary
Actress: The Madras High Court reserveed its order on Tamil Nadu former Minister Manikandan's bail plea.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X