షాకింగ్: హాల్ టికెట్‌పై స్టార్ హీరోయిన్ టాప్ లెస్ ఫోటో..

తన ఫోటోకు బదులు ఓ స్టార్ హీరోయిన్ టాప్ లెస్ ఫోటో దర్శనమివ్వడంతో ఆ విద్యార్థినికి ఏంచేయాలో అర్థం కాలేదు.

పాట్నా: అధికారులు చేసిన నిర్లక్ష్యపు పనికి ఏకంగా ఓ టాప్ లెస్ ఫోటో హాల్ టికెట్ లోకి ఎక్కింది. ప్రముఖ హిందీ పత్రిక ప్రభాత్ కబర్ లో ఈ కథనం రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే ఓసారి టాపర్ల స్కామ్ లో ఇరుక్కున్న బీహార్ విద్యాశాఖనే ఇప్పుడీ ఘనకార్యాన్ని కూడా మూటకట్టుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్(బీఎస్ఎస్ సీ) ఈ నెల 8న జారీ చేసి ఎస్ఎస్‌సి ఇంటర్ లెవల్ హాల్ టికెట్లలో ఈ తప్పిదం దొర్లింది. నలంద జిల్లాకు చెందిన ఓ విద్యార్థినికి ఈ హాల్ టికెట్ అందింది. హాల్ టికెట్ తీసుకున్న అనంతరం దానిపై టాప్ లెస్ ఫోటోను చూసిన విద్యార్థిని ఒక్కసారిగా షాక్ కు గురైంది.

Actress topless photo in girl admit card for ssc intermediate level exam

తన ఫోటోకు బదులు ఓ స్టార్ హీరోయిన్ టాప్ లెస్ ఫోటో దర్శనమివ్వడంతో ఆ విద్యార్థినికి ఏంచేయాలో అర్థం కాలేదు. హాల్ టికెట్ పైన ఫస్ట్ ఇంటర్ లెవల్ కంబైన్డ్ కాంపీటీటివ్ ఎగ్జామ్-2014 అని ఉంది. జనరల్ నాలెడ్జ్ పేపర్ అడ్మిట్ కార్డులో ఈ టాప్ లెస్ ఫోటోను ముద్రించారు. దీనిపై అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేకపోగా.. ఆ హాల్ టికెట్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+