సత్తా చాటిన అదాని

Gautam Adani: దేశీయ పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానికి చెందిన అదానీ గ్రూప్.. మరోసారి సత్తా చాటింది. ఆర్థిక బలాన్ని నిరూపించుకుంది. సంస్థల పురోగతిలో స్థిరత్వాన్ని ప్రదర్శించింది. రికార్డు స్థాయిలో ఆదాయాన్ని పెంచుకోగలిగింది. దేశ మౌలిక సదుపాయాల రంగంలో అగ్రగామిగా తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంది.

డిసెంబర్ 2024తో ముగిసిన 12 నెలల్లో- అదానీ గ్రూప్ రూ.86,789 కోట్ల రూపాయల ఈబీఐటీడీఏ వెనుకబడి ఉన్నప్పటికీ.. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఏకంగా 10.1 శాతం పెరుగుదలను నమోదు చేసుకుంది. డిసెంబర్‌లో ముగిసిన త్రైమాసికంలోనే 17.2 శాతం వృద్ధిని సాధించి.. రూ. 22,823 కోట్లకు చేరుకుంది.

Adani Group has once again demonstrated its financial strength and resilience

అంతకుముందు ఆదాయంతో పోల్చుకుంటే ఈబీఐటీడీఏ వృద్ధి రేటు 21.3 శాతం నమోదైంది. ఇది- అదాని గ్రూప్ పురోగమనంలో ఉన్న స్థిరత్వానికి ఓ ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఈ వృద్ధికి కీలకంగా వ్యవహరించింది- మౌలిక సదుపాయాల పోర్ట్‌ఫోలియో. ఇందులో అదానీ ఎంటర్‌ప్రైజెస్ కింద సౌర, పవన విద్యుత్, విమానాశ్రయాలు, రోడ్లు.. వంటివి ఉన్నాయి.

ఈ సెగ్మెంట్ మొత్తం కూడా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి మూడు త్రైమాసికాలతో పోల్చుకుంటే 45 శాతం మేర వార్షిక వృద్ధిరేటును సాధించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. గత 12 నెలల కాలంలో 33.3 శాతం వృద్ధిని రికార్డ్ చేశాయి. దేశంలో అభివృద్ధి చెందుతున్న మౌలిక సదుపాయాల రంగం సామర్థ్యం ఏమిటో ఈ ఫలితాలు ప్రస్ఫూటింపజేశాయి.

అదానీ గ్రూప్ ఆర్థిక క్రమశిక్షణ, నిబద్ధతకు ఈ పెరుగుదల అద్దం పట్టినట్టయింది. 2024 సెప్టెంబర్ 30 నాటికి అదాని గ్రూప్ రూ. 53,024 కోట్ల నగదు నిల్వలను కలిగి ఉంది. ఇది వచ్చే 28 నెలల్లో రుణ మొత్తాలను తీర్చడానికి అవసరమైన వెసలుబాటును కల్పించినట్టయింది. ఈ సంఖ్య గ్రూప్ స్థూల రుణంలో 20.5 శాతం.

ప్రస్తుతం రూ.5.53 లక్షల కోట్లుగా ఉన్న గ్రూప్ ప్రాపర్టీ.. మూడు దశాబ్దాల వ్యూహాత్మక విస్తరణలో ఓ భాగం. స్థూల రుణం రూ.2.58 లక్షల కోట్లు కాగా నికర రుణం రూ.2.05 లక్షల కోట్లు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగంలో స్థూల ఆస్తుల నికర రుణం 2.7 రెట్లు మెరుగుపడింది. గత ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే 2.63 రెట్లు అధికం.

అదానీ గ్రూప్ లాభాల్లో 85 శాతం రెవెన్యూ దాని ప్రధాన మౌలిక సదుపాయాల నుండే అందుతోంది. వీటిలో యుటిలిటీస్, రవాణా వంటవి ఉన్నాయి. గ్రూప్ సంస్థల్లో ఫ్లాగ్ షిప్‌గా చెప్పుకొనే ప్రధాన మౌలిక సదుపాయాల పోర్ట్‌ఫోలియో మొత్తం ఈబీఐటీడీఏ 84 శాతం పెరుగుదలకు ఈ సెగ్మెంట్ దోహదపడుతోంది.

ఇక పవర్, గ్రీన్ ఎనర్జీ, పోర్టులు, రవాణా వంటి కీలక రంగాల్లో ఆ సంస్థ ఆధిపత్యాన్ని ఈ పోర్ట్‌ఫోలియో మరింత బలోపేతం చేస్తుందనడంలో సందేహాలు అక్కర్లేదు. అదానీ పోర్ట్స్ అండ్ సెజ్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ పవర్, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్, అదానీ టోటల్ గ్యాస్.. ఆ గ్రూప్ విజయాల్లో కీలక పాత్రను పోషిస్తూ వస్తోన్నాయి. అదానీని ప్రపంచ మౌలిక సదుపాయాల రంగంలో అత్యంత శక్తిమంతంగా నిలిపాయి.

గత అయిదు సంవత్సరాలలో ఎలాంటి డౌన్‌గ్రేడ్‌ లేకుండా.. నిరంతర క్రెడిట్ రేటింగ్ అప్‌గ్రేడ్‌ల ద్వారా అసాధారణ ఆర్థిక స్థిరత్వాన్ని సాధిస్తూ వస్తోంది అదాని గ్రూప్. దేశీయంగా AA-, అంతకంటే ఎక్కువ రేటింగ్ ఉన్న ఆస్తుల నుంచి 75 శాతం ఈబీఐటీడీఏ ఇప్పుడు నమోదు కావడం ఓ మైలురాయిగా చెప్పుకోవచ్చు. దీన్ని బట్టి చూస్తే- అదాని గ్రూప్ సంస్థల క్రెడిట్ ప్రొఫైల్‌ ఎంత బలోపేతమైందో అర్థం చేసుకోవచ్చు.

భవిష్యత్‌లో అదానీ గ్రూప్ సంస్థల పెట్టుబడి ప్రణాళికలు అద్భుతంగా ఉన్నాయి. వచ్చే దశాబ్ద కాలంలో మూలధన వ్యయంలో 100 బిలియన్ల డాలర్లు (రూ. 8 లక్షల కోట్లు) కట్టుబడి ఉందా సంస్థ. ఈ పెట్టుబడిని ప్రధానంగా అదానీ ఎంటర్‌ప్రైజెస్ నిర్వహిస్తుంది. గ్రీన్ హైడ్రోజన్, విమానాశ్రయాలు, పునరుత్పాదక శక్తి వంటి రంగాలపైనా దృష్టి సారించినట్టవుతుంది.

అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్, అదానీ పోర్ట్స్ అండ్ సెజ్.. దీనికి తమవంతు సహకారాన్ని అందించనున్నాయి. పోర్టులు, ఎయిర్‌పోర్టులు, రోడ్లు, గ్రీన్ ఎనర్జీ.. వంటి రంగాల్లో అదాని గ్రూప్ ఎప్పటికప్పుడు తన బలాన్ని, పట్టును నిరూపించుకుంటూనే వస్తోంది. సరికొత్త ఆవిష్కరణలకు బాటలు వేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+